Upcoming Polls: సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ఓట్ ఫ్రమ్ హోమ్
ABN , First Publish Date - 2023-01-19T07:29:22+05:30 IST
వచ్చే ఎన్నికల్లో ఓట్ ఫ్రమ్ హోం విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం...
అగర్తల(త్రిపుర): వచ్చే ఎన్నికల్లో ఓట్ ఫ్రమ్ హోం విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ సిటిజన్లు(Senior Citizens), దివ్వాంగులు(persons with disabilities) ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం ఉంటుందని త్రిపుర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) వెల్లడించారు.80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఇంటి నుంచే ఓటు వేయవచ్చని ఎన్నికల కమిషన్ తెలిపింది.(Vote From Home Option) త్రిపురలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల(Upcoming Polls) బందోబస్తు కోసం కేంద్ర సాయుధ పారామిలటరీ బలగాలు ప్లాగ్ మార్చ్, నైట్ పెట్రోలింగ్ చేశాయని ఎన్నికల అధికారులు చెప్పారు.
త్రిపురలో ఫిబ్రవరి 16వతేదీన, నాగాలాండ్, మణిపూర్ లలో ఫిబ్రవరి 27వతేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అధికారులు ప్రకటించారు. నాగాలాండ్, మేఘాలయ,త్రిపురలో 31,700 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. వీరితో పాటు 80 ఏళ్ల వయసు దాటిన సీనియర్ సిటిజన్లకు ఓట్ ఫ్రం హోం కల్పించనున్నారు.