Health Facts: ఈ ఒక్క కాయలో ఇంత మహత్యమా..? పెరిగిన వయసునూ దాచేస్తుంది. జుట్టు సమస్యలకూ చెక్..

ABN , First Publish Date - 2023-07-29T14:56:47+05:30 IST

ఈ ఔషధ పండు జుట్టు షైనింగ్ మాత్రమే కాకుండా, బలాన్ని ఇవ్వడానికి కూడా సహాయపడుతుంది.

Health Facts: ఈ ఒక్క కాయలో ఇంత మహత్యమా..? పెరిగిన వయసునూ దాచేస్తుంది. జుట్టు సమస్యలకూ చెక్..
Benefits of Badhal

ప్రకృతిలో చాలారకాల ఔషదాలు మనకు తెలియవు. వీటితో కలిగే ప్రయోజనాలు అనేకం ఉంటాయి. అయితే మంకీ ఫ్రూట్ లేదా మంకీ జాక్ ఫ్రూట్ అని కూడా పిలువబడే 'బాదల్ మొరేసి' కుటుంబానికి చెందిన పండు.చూడడానికి సరైన ఆకారంలో ఉండదు కానీ దీని గుణాలు అనేకం. ఈ పండుతో ఆరోగ్యానికి ఆరోగ్యం, యవ్వనంకూడా పెరుగుతుందటండోయ్.. ఈ మొక్క భారత ఉపఖండం, ఆగ్నేయాసియా అంతటా కనిపిస్తుంది. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, వియత్నాం, కంబోడియా, లావోస్ వంటి కొన్ని ఆసియా దేశాలలో కూడా కనిపిస్తుంది. ఈ ఔషధ పండులో రాగి, ఐరన్, మాంగనీస్, విటమిన్ సి, బీటా కెరోటిన్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పండు తినడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు.. అవేమిటంటే..

మంకీ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

1. మంకీ ఫ్రూట్ తీసుకోవడం వల్ల రక్తాన్ని శుభ్రపరచడంతో పాటు ప్రవాహాలు మెరుగుపడతాయి. నిజానికి, ఈ పండులో ఉండే ఐరన్, ఇతర పోషకాలు శరీరంలోని హిమోగ్లోబిన్ లోపాన్ని తీర్చగలవు.

2. ఈ పండు కాలేయానికి కూడా చాలా ఆరోగ్యకరమైనది. నిజానికి బాదల్‌ ఫ్రూట్ లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఇది కూడా చదవండి: బియ్యం కడిగిన నీళ్లను ముఖానికి రాసుకుంటే మంచిదని విన్నారా..? అయితే ఈ 7 నిజాలు తెలుసుకోవాల్సిందే..!


3. ఈ పండు ముఖంపై కనిపించే వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. బాదల్ చెట్టు బెరడును ఎండబెట్టి పొడి చేసి, ఆపై ఈ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేయండి. ఇది ముఖ కాంతిని రెట్టింపు చేస్తుంది. ఈ ఔషధ పండు జుట్టు షైనింగ్ మాత్రమే కాకుండా, బలాన్ని ఇవ్వడానికి కూడా సహాయపడుతుంది.

4. మంకీ ఫ్రూట్ పండు తినడం వల్ల ఒత్తిడి కూడా దూరమవుతుంది. ఇందులో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరానికి చల్లదనం కూడా వస్తుంది. అలాగే వయసు కనిపించకుండా చేస్తుందట. ఓసారి మీరు ట్రై చేయండి.

Updated Date - 2023-07-29T14:56:47+05:30 IST