World Sleep Day: నిద్రకీ ఓ రోజుందని.., ఈ కంపెనీ ఏకంగా నిద్రపొమ్మని ఉద్యోగులకు సెలవిచ్చేసిందట.. !

ABN , First Publish Date - 2023-03-17T12:32:22+05:30 IST

నిద్ర ప్రాముఖ్యతను చెప్పడం, చాలా మంది బాధపడే నిద్ర సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు.

World Sleep Day: నిద్రకీ ఓ రోజుందని.., ఈ కంపెనీ ఏకంగా నిద్రపొమ్మని ఉద్యోగులకు సెలవిచ్చేసిందట.. !
World Sleep Day

ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చిలో 17వ తేదీన జరుపుకుంటున్నారు. వరల్డ్ స్లీప్ డే సొసైటీ, వరల్డ్ స్లీప్ డే కమిటీ ఈ సెలవుదినాన్ని నిర్వహిస్తుంది. నిద్ర ప్రాముఖ్యతను చెప్పడం, చాలా మంది బాధపడే నిద్ర సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు.

ఈ స్లీప్ డే సందర్భంగా వేక్‌ఫిట్ సొల్యూషన్స్ అనే కంపెనీ, D2C హోమ్ అండ్ స్లీప్ సొల్యూషన్స్ స్టార్ట్ అప్, లింక్డ్‌ఇన్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది, అది ఉద్యోగులందరికీ పంపిన మెయిల్ స్క్రీన్‌షాట్. "సర్‌ప్రైజ్ హాలిడే: అనౌన్సింగ్ ది గిఫ్ట్ ఆఫ్ స్లీప్" అనేది ఉద్యోగులకు పంపిన మెయిల్.

గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్‌కార్డ్ 6వ ఎడిషన్ 2022 నుండి పని వేళల్లో నిద్రపోతున్న వ్యక్తులలో 21% పెరుగుదలను, అలసటతో మేల్కొనే వ్యక్తులలో 11% పెరుగుదలను గమనించింది. నిద్ర లేమి సమస్యను పరిశీలిస్తే, స్లీప్ డేని జరుపుకోవడానికి గిఫ్ట్ ఆఫ్ స్లీప్ కంటే మెరుగైన మార్గం ఏముంటుంది?" వేక్‌ఫిట్ తన ఉద్యోగులందరికీ Optional సెలవుదినంగా మార్చి 17వ తేదీ శుక్రవారం అంతర్జాతీయ నిద్ర దినోత్సవాన్ని జరుపుకోనుందని ప్రకటించినంది. ఈ స్లీప్ డేని ఆనందంగా పండుగలా జరుపుకోవాలని కోరుకుంటున్నామనేది ఆ మెయిల్ ముఖ్య సారాంశం.

ఇది కూడా చదవండి: చేతి గోళ్ళు పెళుసుగా ఉండి విరిగిపోతున్నాయా? బలంగా పెరగాలంటే ఇవి తినాల్సిందే..!

ఇదే కాదు. గత సంవత్సరం, కంపెనీ తన వర్క్‌ఫోర్స్ కోసం "రైట్ టు నాప్ పాలసీ (Right to Nap Policy)"ని ప్రకటించింది, దీని ద్వారా కంపెనీ ఉద్యోగులందరూ తమ పని వేళల్లో 30 నిమిషాల నిద్రపోయేలా చేసింది. శరీరాన్ని రీఛార్జ్ చేయడంలో, చేతిలో ఉన్న పనిపై మళ్లీ దృష్టి కేంద్రీకరించడంలో సహాయం చేయడంలో మధ్యాహ్న నిద్ర ఉపకరిస్తుంది, ఇది ఆఫీసులలో ఉత్పాదకత, ప్రేరణ (Productivity, motivation) ను మెరుగుపరుస్తుంది.

కంపెనీలు నెమ్మదిగా నిద్ర ప్రాముఖ్యతను గుర్తిస్తున్నాయి. హఢావుడిగా పనికి వచ్చినా సరైన నిద్రలేకపోవడంతో మానసిక ఒత్తిడి, రుగ్మతలతో ఉద్యోగులు సతమతం కావడం ఇకపై ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఈ కంపెనీ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించింది. మానసిక ఉల్లాసంతో పని చేయడం అందరికీ సంతోషాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చింది.

Updated Date - 2023-03-17T12:32:22+05:30 IST