California Winter Storm: కాలిఫోర్నియాను కప్పేసిన మంచు.. గత 4 దశాబ్దాల్లో ఎన్నడూ లేని దారుణ పరిస్థితులు..!

ABN , First Publish Date - 2023-02-26T07:41:43+05:30 IST

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో శీతాకాలపు మంచు భీకరంగా కురుస్తోంది.

California Winter Storm: కాలిఫోర్నియాను కప్పేసిన మంచు.. గత 4 దశాబ్దాల్లో ఎన్నడూ లేని దారుణ పరిస్థితులు..!

కాలిఫోర్నియాలో భీకర మంచు

లాస్‌ ఏంజెలెస్‌, ఫిబ్రవరి 25: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో శీతాకాలపు మంచు భీకరంగా కురుస్తోంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న చలిగాలులు ప్రజలను గజగజ వణికిస్తున్నాయి. విపరీతమైన వాతావరణ పరిస్థితులకు తోడు ఆకస్మిక వరదలు రావొచ్చన్న అధికారుల హెచ్చరికలు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. దక్షిణ కాలిఫోర్నియాలో రోడ్లపై మంచు దట్టంగా పేరుకుపోవడంతో అనేక చోట్ల ప్రధాన రహదారులను కూడా మూసివేశారు. మెక్సికో, కాలిఫోర్నియా, కెనడా, పసిఫిక్‌ నార్త్‌వె్‌స్టను కలిపే అంతర్రాష్ట రహదారిని కూడా మూసివేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. శుక్రవారం కాలిఫోర్నియాలో పలుచోట్ల భారీ వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరోవైపు, కరెంటు తీగలపై మంచు గడ్డుకుపోతుండటంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. లక్షలాది ఇండ్లకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. దక్షిణ కాలిఫోర్నియాలో గడిచిన మూడు నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత మంచు కరుస్తోందని అధికారులు తెలిపారు. లాస్‌ ఏంజెలెస్‌ సమీపంలోని పర్వత శ్రేణుల్లో ఐదు అడుగుల మేర మంచు పేరుకుపోయింది.

Updated Date - 2023-02-26T07:41:49+05:30 IST