US: సముద్రంలో మునిగిపోతున్న కొడుకుని కాపాడే ప్రయత్నంలో.. ప్రాణాలు కోల్పోయిన తెలుగు ఎన్నారై
ABN , First Publish Date - 2023-06-06T07:31:50+05:30 IST
అమెరికాలోని తెలుగు కుటుంబంలో విషాదం నెలకొంది.
అమెరికాలో తెలుగు ప్రవాసి మృతి
న్యూయార్క్, జూన్ 5: అమెరికాలోని తెలుగు కుటుంబంలో విషాదం నెలకొంది. నీటిలో మునిగిపోతున్న 12 ఏళ్ల కుమారుడిని కాపాడే ప్రయత్నంలో తండ్రి జొన్నలగడ్డ శ్రీనివాసమూర్తి ప్రాణాలు కోల్పోయారు. కాలిఫోర్నియాలోని పాంథర్ స్టేట్ బీచ్‌లో గత సోమవారం ఈ దుర్ఘటన జరిగింది. ఆ రోజు సాయంత్రం శ్రీనివాసమూర్తి కుమారుడు బీచ్‌లో దిగి నీటిలో నుంచి బయటకు రాలేకపోయాడు. శ్రీనివాసమూర్తికి ఈత రానప్పటికీ కుమారుడిని కాపాడేందుకు లోపలికి వెళ్లారు. ఈ క్రమంలో కుమారుడిని కాపాడిప్పటికీ.. భారీ అల అతన్ని సముద్రంలోకి లాక్కెళ్లడంతో కుటుంబసభ్యులు నిస్సహాయులుగా చూస్తుండిపోయారు. వెంటనే అక్కడికి చేరుకున్న అత్యవసర సిబ్బంది శ్రీనివాసమూర్తిని బయటకు తీసుకొచ్చారు. కాలిఫోర్నియా హైవే పెట్రోల్ హెలికాప్టర్‌లో హుటాహుటిన స్టాన్‌ఫోర్డ్ హాస్పటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.