Anju Yadav : అంజూ యాదవ్ వైసీపీ కండువా కప్పుకోబోతున్నారా.. పరిశీలనలో మూడు నియోజకవర్గాలు.. ఎక్కడ చూసినా ఇదే చర్చ!?
ABN , First Publish Date - 2023-07-21T22:29:40+05:30 IST
సీఐ అంజూ యాదవ్.. (CI Anju Yadav) ఇప్పుడీ పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతోంది..! వైసీపీ బ్యాచ్ (YSRCP Batch) ఈమెను ఈమెను ‘లేడీ సింగం’.. ‘ఆంధ్రా కిరణ్ బేడీ’ గా.. సామాన్యులు, నెటిజన్లు మాత్రం వివాదాస్పద సీఐగా పిలుచుకుంటున్నారు.! ఇప్పటికే పలుమార్లు వివాదాస్పద చర్యలతో వార్తల్లో నిలిచిన అంజూ యాదవ్.. జనసేన కార్యకర్తను అకారణంగా చెంపలకేసి కొట్టడం, ఈ వ్యవహారాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సీరియస్‌గా తీసుకొని స్వయంగా వచ్చి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యారు...
సీఐ అంజూ యాదవ్.. (CI Anju Yadav) ఇప్పుడీ పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతోంది..! వైసీపీ బ్యాచ్ (YSRCP Batch) ఈమెను ఈమెను ‘లేడీ సింగం’.. ‘ఆంధ్రా కిరణ్ బేడీ’ గా.. సామాన్యులు, నెటిజన్లు మాత్రం వివాదాస్పద సీఐగా పిలుచుకుంటున్నారు.! ఇప్పటికే పలుమార్లు వివాదాస్పద చర్యలతో వార్తల్లో నిలిచిన అంజూ యాదవ్.. జనసేన కార్యకర్తను అకారణంగా చెంపలకేసి కొట్టడం, ఈ వ్యవహారాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సీరియస్‌గా తీసుకొని స్వయంగా వచ్చి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాలో, మీడియాలో నాలుగైదు రోజులపాటు ఎక్కడ చూసినా అంజూ గురించే వార్తలు వచ్చాయ్. ఇవన్నీ అటుంచితే.. రెండు మూడ్రోజులుగా అంజూ యాదవ్ రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. అతి త్వరలోనే అంజు యాద్ సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ ఈమె రాజకీయాల్లోకి వస్తే పరిస్థితేంటి..? ఈమెను ఇంతలా ప్రోత్సహిస్తున్నదెవరు..? పొలిటికల్ ఎంట్రీ (Anju Yadav Politcal Entry) ఇస్తే ఏ పార్టీ తరఫున.. ఎక్కడ్నుంచి పోటీచేస్తారని ప్రచారం జరుగుతోందనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..!
ఇదీ అసలు కథ..!
2019 ఎన్నికల ముందు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన గోరంట్ల మాధవ్‌ను (Gorantla Madhav) వైసీపీ అక్కున చేర్చుకొని.. హిందూపురం (Hindupuram) పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దింపి గెలిపించుకుంది. ఆ తర్వాత ఎంపీగా ఏం ఒరగబెట్టారో.. ఏ మాత్రం ప్రజాసేవ చేశారో ఆ నియోజకవర్గ ప్రజలకే తెలియాలి.! ఆ మధ్య ఓ వీడియోతో తన పదవికే కళంకం తెచ్చారు గోరంట్ల. ఇక ఆ విషయాలు అటుంచితే.. అదే తరహాలో ఇప్పుడు వివాదాస్పద సీఐ అంజూ యాదవ్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ రెడ్డి భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే.. గత నాలుగేళ్లుగా ప్రతిసారీ ప్రభుత్వం, వైఎస్ జగన్ దృష్టిలో పడటానికి ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, నేతలు ఏ కార్యక్రమం చేపట్టినా అణిచివేయడం, ధర్నాలు, నిరసనలకు ఛాన్స్ ఇవ్వకుండా వారిపై ఉక్కుపాదం మోపడం, స్థానిక ఎమ్మెల్యే ఏం చెప్పినా తూ.చ తప్పకుండా పాటిస్తూ ఉండటంతో అంజూ యాదవ్‌కు అండదండలు ఎక్కువయ్యాయ్. అయితే ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్త కొట్టే శ్రీను చెంపలకేసి కొట్టడంతో ఈమె పేరు మార్మోగింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో అంజూ పేరు మోతెక్కింది.! సీన్ కట్ చేస్తే.. ఇదంతా వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) దృష్టిలో పడటానికే చేస్తున్నట్లు సమాచారం. నిత్యం వార్తల్లో నిలవడంతో అసలు ఎవరీమె అని ప్రభుత్వం ఎంక్వయిరీ చేస్తుందని.. అప్పుడు తనకంటూ ఓ గుర్తింపు వస్తుందని.. ఆ తర్వాతే తన మనసులోని మాటను బయటపెట్టొచ్చని భావిస్తున్నారట. రాజకీయాల్లోకి రావాలన్నదే తన కోరికని కొందరు తన ఆప్తమిత్రులతో ఎప్పుడూ చెబుతుంటారట. అందుకే ఇందుకు తగ్గట్టుగా జగన్ కంట్లో పడటానికి ఇలా సమయం, సందర్భం లేకుండా రచ్చ రచ్చ చేస్తూ వస్తున్నారట. ఎంత వివాదాస్పదం అయినా సరే వార్తల్లో నిలవాలంతే అన్నదే ఆమె నైజమట.
సోషల్ మీడియాలో ఇలా..!
రాజకీయాల్లోకి రావాలని తహతహలాడుతున్న అంజూ యాదవ్ స్వగ్రామం కడప జిల్లా (Kadapa) నంది మండలం. ఓబన్న, అనంతమ్మ దంపతులకు ఈమె జన్మించారు. చదవుపై మక్కువతో సైకాలజీలో మాస్టర్ డిగ్రీ చేసి ఆ తర్వాత బ్యాంక్ ఉద్యోగాలకు ప్రయత్నించినా వర్కవుట్ అవ్వలేదు. డేరింగ్ అండ్ డాషింగ్ కావడంతో మిత్రుల ప్రోత్సాహంతో ఎస్సై పోటీ పరీక్షలు రాసి పాసయ్యారు. మొదట 1998లో చిత్తూరు జిల్లాలో ఎస్‌ఐగా వచ్చిన అంజూ ఇప్పటి వరకూ జిల్లాలోనే ఉంటున్నారు. మాజీ సీఎం చంద్రబాబుపై (Chandrababu) తిరుపతి అలిపిరి వద్ద జరిగిన నక్సల్స్ దాడి నుంచి ఆయన్ను కాపాడి వీరోచిత పోలీస్ ఆఫీసర్‌గా నిలిచారు. అయితే.. ఆ తర్వాత వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. తమ జిల్లాలో ఈమె వద్దు బాబోయ్ అని కొందరు రాజకీయ నేతలు వాపోగా.. ఈమే కావాలని మరికొందరు రాజకీయ నేతలు పట్టుబట్టిన పరిస్థితులున్నాయ్!. అయితే.. సోషల్ మీడియా, తాడేపల్లి వర్గాల నుంచి సమాచారం మేరకు అంజూ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఈ మొత్తం వ్యవహారం వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చక్రం తిప్పినట్లుగా తెలియవచ్చింది. అయితే.. సొంత జిల్లా కావడం, ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను నిలువరించి ఉక్కుపాదం మోపుతుండటం, ఎప్పుడూ వివాదాల్లో నిలవడంతో ఇవన్నీ రాజకీయాల్లోకి దారి చూపాయట. జగన్‌కు కూడా అంజూ నైజం నచ్చడంతో పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలే ఇలా గుసగుసలాడుతుండటం గమనార్హం. నిప్పులేనిదే పొగ రాదన్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోతే.. ఇలాంటి వార్తలు ఎందుకు పుట్టుకొస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
పోటీ ఇక్కడ్నుంచేనట..!
వైసీపీ కండువా కప్పుకున్న తర్వాత అన్నీ అనుకున్నట్లు జరిగితే.. చిత్తూరు ఎంపీగా (Chittoor MP) లేదా.. మైదుకూరు (Mydukur) ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయట. ఎందుకంటే.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఎక్కువ కాలం అంజూ పనిచేయడంతో పరిచయాలు ఎక్కువగా ఉంటాయని వైసీపీ అధిష్టానం భావిస్తోందట. ఇక మైదుకూరు విషయానికొస్తే.. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి గత ఎన్నికల్లోనే ఇక్కడ్నుంచి బలవంతంగా పోటీచేశారని టాక్ వచ్చింది. వయసు, ఆరోగ్య రీత్యా ఈసారి పోటీకి దూరంగా ఉంటారని టాక్ నడుస్తోంది. ఇదే జరిగితే మైదుకూరు ఎమ్మెల్యేగా పోటీచేస్తారని టాక్. అయితే.. పవన్ కల్యాణ్ ఈసారి తిరుపతి (Tirupati) నుంచి పోటీచేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. పవన్ పోటీ చేస్తే మాత్రం సేనాని మీద అంజూను పోటీచేయించాలన్నది వైసీపీ ప్లానట. అంటే మొత్తం మూడు స్థానాలు పరిశీలనలో ఉండగా.. ఏదో ఒకచోట్నుంచీ పోటీకి దిగుతారట. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. అయితే రెండు మూడ్రోజులుగా సోషల్ మీడియాలో వైసీపీ వీరాభిమానులే ఈ రేంజ్‌లో వైరల్ చేస్తున్నా అటు అంజూ యాదవ్‌గానీ.. ఇటు వైసీపీ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే మరి.