Pawan Varahi Yatra : పవన్ ‘వారాహి’ యాత్రలో ఇంట్రెస్టింగ్ సీన్.. వైసీపీలో దీని గురించే చర్చ.. మార్పు మొదలైనట్లే..!

ABN , First Publish Date - 2023-07-09T18:22:16+05:30 IST

అవును.. ఏపీ రాజకీయాల్లో మార్పు మొదలైంది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ‘వారాహి యాత్ర’ (Pawan kalyan Varahi Yatra) మొదటి విడత విజయవంతంగా ముగియగా.. రెండో విడత కూడా ప్రారంభమైంది. అధికార వైసీపీ (YSR Congress) తప్పొప్పులను ఎత్తిచూపుతూ.. తప్పుచేసిన ఎమ్మెల్యేలను నిలదీస్తూ యాత్ర సాగుతోంది...

Pawan Varahi Yatra : పవన్ ‘వారాహి’ యాత్రలో ఇంట్రెస్టింగ్ సీన్.. వైసీపీలో దీని గురించే చర్చ.. మార్పు మొదలైనట్లే..!

అవును.. ఏపీ రాజకీయాల్లో మార్పు మొదలైంది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ‘వారాహి యాత్ర’ (Pawan kalyan Varahi Yatra) మొదటి విడత విజయవంతంగా ముగియగా.. రెండో విడత కూడా ప్రారంభమైంది. అధికార వైసీపీ (YSR Congress) తప్పొప్పులను ఎత్తిచూపుతూ.. తప్పుచేసిన ఎమ్మెల్యేలను నిలదీస్తూ యాత్ర సాగుతోంది. ఒకానొక దశలో పవన్ సంధించిన ప్రశ్నలకు వైసీపీ నుంచి ఒక్కరంటే ఒక్కరూ నోరుమెదపని పరిస్థితి. ముఖ్యంగా కాకినాడలో సేనాని ఇచ్చిన స్పీచ్‌ ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది. నిన్న, మొన్నటి వరకూ దీని గురించే చర్చ జరింది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఎవర్నీ శత్రువులుగా భావించకుండా అందరితోనూ స్నేహపూర్వకంగానే పవన్.. యాత్ర సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే టాలీవుడ్ టాప్ హీరోల (Tollywood Top Heros) గురించి ఆచితూచి సేనాని మాట్లాడారు. అయితే పవన్ ప్రసంగానికి ఫిదా అయినా ఆయా హీరోల అభిమాన సంఘాలు పెద్ద ఎత్తున వారాహి యాత్రకు మద్దతు పలుకుతున్నాయి. ఇదంతా వారాహి మొదటి విడతలో జరగ్గా.. ఇప్పుడు జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ సీన్ రాష్ట్ర రాజకీయాల్లో మరీ ముఖ్యంగా వైసీపీలో చర్చనీయాంశం అయ్యింది.


Varahi-Pawan.jpg

అసలేం జరిగిందంటే..

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో (Eluru) వారాహి యాత్ర ప్రారంభం కానుంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి ఏలూరు పర్యటనకు పవన్ బయల్దేరివెళ్లారు. ఏలూరులో ఇవాళ సాయంత్రం బహిరంగ సభ జరగనుంది. ఈయాత్రలో భాగంగా సేనానికి సినీ హీరోల అభిమాన సంఘాలు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఇన్నిరోజులు చిన్న చిన్న ప్రకటనలు, సోషల్ మీడియాలోనే ఇదంతా జరగ్గా.. ఇప్పుడు ఏకంగా ఫ్లెక్సీలు, బ్యానర్లతో అభిమాన సంఘాలు ఘన స్వాగతం పలికాయి. ఏలూరులో ఎక్కడ చూసినా పవన్‌కు స్వాగతం పలుకుతూ ఉన్న ఫ్లెక్సీలు.. ఆయా హీరోలు, అభిమానుల ఫొటోలే దర్శనమిస్తున్నాయి. ‘వారాహి విజయ యాత్ర’ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ఫ్యాన్స్ స్వాగతం పలికారు. ‘మార్పు మొదలైంది’ అంటూ నందమూరి బాలకృష్ణ (Balakrishna) , జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr) వీరాభిమానులు, అభిమాన సంఘాలు పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేశారు. సో.. ఈ ఒక్క సీన్‌తో మార్పు మొదలైందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. టాప్ హీరోలైన బాలయ్య, ఎన్టీఆర్, మహేశ్ అభిమానులు రానున్న రోజుల్లో పవన్‌కు రాజకీయంగా మద్దతు తెలుపుతున్నట్లు ఇలా పరోక్షంగా చెబుతున్నారన్న మాట. ఇప్పుడీ ఫ్లెక్సీలు, బ్యానర్లపై ఏపీ రాజకీయాల్లో (AP Politcs) హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది.

WhatsApp Image 2023-07-09 at 5.35.30 PM.jpeg

హీరోల గురించి పవన్ ఏమన్నారు..?

మొదటి విడత వారాహి యాత్రలో టాలీవుడ్ టాప్ హీరోల గురించి పవన్ ప్రస్తావన తెచ్చారు. ‘ పవన్ ఫ్యాన్స్- ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడూ గొడవపడతారని నాకు కొందరు చెప్పారు. ఎన్టీఆర్ గారు, మహేష్ (Mahesh babu) గారు, బాలకృష్ణ (Balakrishna) గారు, అల్లు అర్జున్ (Allu Arjun) గారు, చిరంజీవి గారు.. ఇలా అందరు హీరోలు నాకు ఎంతో ఇష్టం, అంతకుమించి గౌరవం కూడా. మేము కనపడితే ఒకరినొకరు పలకరించుకుంటాం. మేము అందరం బాగానే ఉంటాం. సినిమా వేరు, రాజకీయాలు వేరు. సినిమాలు ఇష్టపడితే మీరు ఏ హీరోనైనా ఇష్టపడండి. కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాత్రం నా మాట వినండి. ఒక్కసారి ప్రభాస్ గారు, మహేష్ గారు నా కంటే పెద్ద హీరోలు. వాళ్ళు నాకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారు. పాన్ ఇండియా హీరోలు వాళ్ళు. రామ్‌ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయికి వెళ్లిపోయారు. ప్రపంచమంతా వాళ్ళు తెలుసు. నేను ప్రపంచం అంతా తెలియదు. నాకు ఇలా చెప్పడానికి ఎలాంటి ఈగోలు లేవు. నాకు ఒక సగటు మనిషి బాగుండాలి. కులాలు, హీరోల పరంగా కొట్టుకోవద్దు’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అప్పట్లో పవన్ వ్యాఖ్యలు తెగ వైరల్ అయ్యాయి.

WhatsApp Image 2023-07-09 at 5.34.09 PM.jpeg

మొత్తానికి చూస్తే.. పవన్‌కు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసని మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఈ సీన్‌ జరిగిన కొన్నిరోజులకే పవన్‌కు ఎన్టీఆర్ అభిమానుల సంఘం నుంచి ఓ ప్రకటన కూడా వచ్చింది. ఇప్పుడు ఏకంగా మహేశ్ బాబు, ఎన్టీఆర్, బాలయ్య అభిమాన సంఘాల నుంచి స్వాగతం, వారాహి యాత్రకు మద్దతు రావడం గమనార్హం. సో.. దీన్ని బట్టి చూస్తే హీరోల అభిమానులంతా ఒక్కటవుతున్నారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మద్దతివ్వడం, స్వాగతాలు పలకడం అంతా ఓకే గానీ.. ఎన్నికల్లో టైమ్‌లో అభిమానుల నుంచి ఏ మాత్రం ఓట్లు రాలుతాయో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి



TANA Conference : అమెరికా వెళ్లినా అదే ఓవరాక్షన్.. తానా సభల్లో తన్నుకున్న తమ్ముళ్లు.. ఈ ఒక్క నినాదంతో పిడిగుద్దులు..!


Nara Lokesh and Jr Ntr : బావ నుంచి పిలుపొచ్చింది.. అన్నింటికీ ఫుల్ క్లారిటీ కూడా వచ్చేసింది.. ఇక డిసైడ్ కావాల్సింది బాద్ షానే..!


BRS Mla Candidates : షాకింగ్ సర్వే.. ఈ జిల్లాల నుంచి ఇంతమంది సిట్టింగ్‌లకు కేసీఆర్ టికెట్లు ఇవ్వట్లేదా.. వణికిపోతున్న ఎమ్మెల్యేలు..!?


BJP : బండి సంజయ్, సోమువీర్రాజులకు కేంద్రంలో కీలక పదవులు


Rajyasabha : ఎన్నికల ముందు బీజేపీ వ్యూహాత్మక అడుగులు.. రాజ్యసభకు ‘తెలుగోడు’..!


YS Sharmila : వైఎస్సార్ జయంతి ముందురోజే వైఎస్ షర్మిల ఆసక్తికర నిర్ణయం.. అదేంటో తెలిస్తే..!


Modi TS Tour : మోదీ వరంగల్ వచ్చివెళ్లాక తెలంగాణ బీజేపీలో ఒకటే గుసగుస.. దేని గురించంటే..?


Jagan Vs Sharmila : వైఎస్సార్ జయంతి సాక్షిగా వైఎస్ జగన్ రెడ్డి వర్సెస్ షర్మిల.. ప్రత్యేకంగా ఫోన్లు చేసి మరీ..!


BRS Mla Candidates : షాకింగ్ సర్వే.. ఈ జిల్లాల నుంచి ఇంతమంది సిట్టింగ్‌లకు కేసీఆర్ టికెట్లు ఇవ్వట్లేదా.. వణికిపోతున్న ఎమ్మెల్యేలు..!?


Updated Date - 2023-07-09T18:26:22+05:30 IST