Horoscope : రాశిఫలాలు

ABN , First Publish Date - 2023-06-16T08:01:55+05:30 IST

నేడు (16-6-2023 - శుక్రవారం) ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుందట. మిథునరాశి వారు కొత్త ప్రాజెక్టులు చేపడతారు. కర్కాటక రాశివారికి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక మిగిలిన అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Horoscope : రాశిఫలాలు

నేడు (16-6-2023 - శుక్రవారం) ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుందట. మిథునరాశి వారు కొత్త ప్రాజెక్టులు చేపడతారు. కర్కాటక రాశివారికి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక మిగిలిన అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

శుభవార్త అందుకుంటారు. వాహనం కొనుగోలు చేస్తారు. అన్నదమ్ముల విషయాల్లో శుభపరిణామాలు జరుగుతాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. స్టేషనరీ, రవాణా రంగాల వారికి ప్రోత్సాహకరం.

MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రుణాలు మంజూరవుతాయి. పెట్టుబడులపై మంచి ప్రతిఫలం అందుకుంటారు. బ్యాంకులు, ఫైనాన్స్‌, జ్యుయలరీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

కొత్త ప్రాజెక్టులు చేపడతారు. కొద్దిరోజులుగా నెలకొన్న స్తబ్దత తొలగిపోయి ఉత్సాహం నెలకొంటుంది. చక్కటి ఆలోచనలు స్ఫురిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది. చొరవతో ఎదుటి వారి మనసు గెలుచుకుంటారు. వ్యక్తిగత విషయాలపై శ్రద్ధ చూపిస్తారు.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకు వెళ్లాలనే సంకల్పం నెరవేరుతుంది. సినిమాలు, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఫొటోగ్రఫీ, ఎగుమతుల రంగాల వారికి అనుకూల సమయం. ఆధ్యాత్మిక, సేవాకార్యక్రమాలు సంతృప్తినిస్తాయి.

MESHAM-05.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

సంఘాలు, యూనియన్‌ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. స్టాక్‌మార్కెట్‌ లావాదేవీలకు అనుకూలం. పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం అందుకుంటారు.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. లక్ష్య సాధనలో పెద్దల సహకారం లభిస్తుంది. పదిమందిలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ప్రభుత్వ సంస్థలు, మేనేజ్‌మెంట్‌ రంగాల వారికి ప్రోత్సాహకరం. ప్రముఖులను కలుసుకుంటారు.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. రక్షణ, బోధన, న్యాయ, రవాణా, కన్సల్టెన్సీ రంగాలకు చెందిన నిపుణులు సత్ఫలితాలు సాధిస్తారు. కళలు, రచనా రంగాల వారికి అనుకూల సమయం.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఆరోగ్యం మెరుగుపడుతుంది. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. వడ్డీలు, అద్దెలు అందుకుంటారు. బాకీలు వసూలవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బ్యాంకులావాదేవీలకు అనుకూలమైన రోజు. సకాలంలో నిధులు సర్దుబాటవుతాయి.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. జనసంబంధాలు పెంపొందుతాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలు లాభిస్తాయి. వివాహ నిర్ణయాలకు అనుకూలం. వేడుకల్లో పాల్గొంటారు.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆ రోగ్యం మెరుగుపడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. లక్ష్య సాధనలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఫార్మా, హోటల్‌ రంగాల వారికి అనుకూలమైన రోజు.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

చిన్నారుల విద్యా విషయాల్లో శుభపరిణామాలు సంభవం. టెలివిజన్‌, క్రీడలు, అడ్వర్టయిజ్‌మెంట్‌, బోధన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుబంధాలు బలపడతాయి.

MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

హార్డ్‌వేర్‌, రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ మనసు మార్పు కోరుకుంటుంది. బదిలీలు, మార్పులకు అనుకూలం. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - 2023-06-16T08:08:24+05:30 IST