Share News

Gas Stove Funny Video: గ్యాస్ స్టవ్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఇతడి అతి తెలివి చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Apr 16 , 2025 | 11:44 AM

ఓ వ్యక్తి గ్యాస్ స్టవ్‌ను వాడే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. బాత్రూంలో షవర్ స్నానం చేయాలని అనుకున్న అతను.. అందుకోసం గ్యాస్ స్టవ్‌‌ను ఎందుకు వాడకూడదని ఆలోచించాడు. చివరకు ఏం చేశాడో మీరే చూడండి..

Gas Stove Funny Video: గ్యాస్ స్టవ్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఇతడి అతి తెలివి చూస్తే అవాక్కవ్వాల్సిందే..

వినూత్నంగా ఆలోచించేవారికి సోషల్ మీడియా మంచి వేదికగా మారుతోంది. దీన్ని అవకాశంగా తీసుకుని ఎంతో మంది తమ ప్రతిభను చాటుకుంటూ ఫేమస్ అవుతున్నారు. అయితే కొందరు మాత్రం అతి తెలివిగా ఆలోచిస్తూ నెటిజన్లను ఆకర్షించేందుకు ఏవోవే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి చిత్రవిచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి గ్యాస్ స్టవ్‌ను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘గ్యాస్ స్టవ్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి గ్యాస్ స్టవ్‌ను (Gas stove) వాడే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. బాత్రూంలో షవర్ (Bathroom shower) స్నానం చేయాలని అనుకున్న అతను.. అందుకోసం గ్యాస్ స్టవ్‌‌ను ఎందుకు వాడకూడదని ఆలోచించాడు. ఆలోచన వచ్చిందే తడవుగా .. ఆచరణలో పెట్టేశాడు.

Live Death Video: అడుగు దూరంలో మరణం.. గుండెల్ని మెలిపెట్టే సీన్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..


గ్యాస్ స్టవ్‌ను తీసుకెళ్లి బాత్రూంలో తలకిందులుగా వేలాడదీశాడు. తర్వాత దానికి నీళ్ల పైపును తగిలించాడు. కుళాయిని ఆన్ చేయడగానే నీళ్లు గ్యాస్ స్టవ్‌లోని బర్నర్ల ద్వారా బయటికి వచ్చేలా ఏర్పాట్లు చేశాడు. నీళ్ల వేగం పెరిగేకొద్దీ షవర్ తరహాలోనే బయటికి వస్తున్నాయి. ఇలా సెట్ చేసిన తర్వాత ఎంచక్కా స్టవ్ కింద కూర్చుని స్నానం చేసేశాడు.

Viral Video: బాత్‌రూం క్లీనింగ్ అంటే ఇదా.. బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా..


ఇలా గ్యాస్ స్టవ్‌ను కాస్తా.. బాత్రూం షవర్‌గా మార్చేశాడన్నమాట. ఇతడి విచిత్రమైన ప్రయోగం చూసి అంత అవాక్కవుతున్నారు. ‘‘గ్యాస్ స్టవ్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి టాలెంట్ ఇండియా దాటి వెళ్లకూడదు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1600కి పైగా లైక్‌లు, 5.37 లక్షలకు పైగా వ్యూస్‌‌‌ను సొంతం చేసుకుంది.

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..


ఇవి కూడా చదవండి..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: బాత్‌రూం క్లీనింగ్ అంటే ఇదా.. బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 16 , 2025 | 11:44 AM