Horoscope : రాశిఫలాలు
ABN , First Publish Date - 2023-06-28T08:22:43+05:30 IST
నేడు (28-6-2023 - బుధవారం) ఇవాళ ప్రతి ఒక్కరూ తమ రాశి ఫలితాలను తెలుసుకుని తీరాల్సిందే. అన్ని రాశుల వారికి చాలా అద్భుతంగా ఉంది. కొన్ని రాశుల వారు వినూత్నంగా ఆలోచించి ఆదాయాన్ని పెంచుకునే యత్నం చేస్తారట. దాదాపు ప్రతి ఒక్క రాశివారు తెలుసుకోవాల్సిన మంచి విషయాలున్నాయి.
నేడు (28-6-2023 - బుధవారం) ఇవాళ ప్రతి ఒక్కరూ తమ రాశి ఫలితాలను తెలుసుకుని తీరాల్సిందే. అన్ని రాశుల వారికి చాలా అద్భుతంగా ఉంది. కొన్ని రాశుల వారు వినూత్నంగా ఆలోచించి ఆదాయాన్ని పెంచుకునే యత్నం చేస్తారట. దాదాపు ప్రతి ఒక్క రాశివారు తెలుసుకోవాల్సిన మంచి విషయాలున్నాయి.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
కుటుంబ విషయాల్లో శుభపరిణామాలు సంభవం. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. జనసంబంధాలు విస్తరిస్తాయి. ఇల్లు, స్థలసేకరణకు సంబంధించి భాగస్వామితో చర్చిస్తారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. సోదరీ సోదరుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తిపరమైన ప్రయాణాలకు అనుకూలం. మార్కెటింగ్, స్టేషనరీ, ఏజెన్సీలు, ట్రావెలింగ్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
అడ్వర్టయిజ్‌మెంట్స్, టెలివిజన్, క్రీడలు, పాఠశాల రంగాల వారికి ఆర్థికంగా లాభిస్తుంది. వినూత్నంగా ఆలోచించి ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. చిన్నారుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంకల్పం నెరవేరుతుంది.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
కుటుంబ విషయాలపై శ్రద్ధ చూపిస్తారు. ఇల్లు, స్థలసేకరణకు సంబంధించిన అంశాలపై ఒక నిర్ణయానికి వస్తారు. నిర్మాణం, స్థలాల క్రయవిక్రయ రంగాల వారికి సంకల్పం నెరవేరుతుంది. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది.
సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
విద్యార్థులకు శుభప్రదం. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వీసా ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్నదమ్ముల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. రాజకీయ, సినిమా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులు, పొదుపు పథకాలలో మంచి ప్రతిఫలం అందుకుంటారు. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. సన్నిహితుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్టాక్‌మార్కెట్ లావాదేవీలకు అనుకూలం. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖుల కలయిక ఆనందం కలిగిస్తుంది. తల్లిదండ్రుల విషయంలో శుభపరిణామాలు సంభవం. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పెద్దల సహకారంతో వృత్తిపరమైన లక్ష్యాలు సాధిస్తారు.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
సినిమాలు, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. టెలివిజన్, కళలు, మైనింగ్, టెక్స్‌టైల్స్, ఎగుమతులు, ఫొటోగ్రఫీ రంగాల వారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
పన్నుల సమస్యలు పరిష్కారం అ వుతాయి. మ్యూచ్యువల్ ఫండ్స్, స్టాక్‌మార్కెట్ లావాదేవీలపై దృష్టి పెడతారు. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో ఆంతరంగిక విషయాలు చర్చకు వస్తాయ. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
బృందకార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. పెద్దల నుంచి మన్ననలు అందుకుంటారు. లక్ష్య సాధనలో పైఅధికారుల సహకారం లభిస్తుంది. జనసంబంధాలు విస్తరిస్తాయి. వివాహ నిర్ణయాలకు అనుకూలం. ఉన్నత పదవులు అందుకుంటారు.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
రక్షణ, బోధన, రవాణా, కన్సల్టెన్సీ రంగాల వారికి వృత్తిపరంగా లాభిస్తుంది. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. దూరంలో ఉన్న వ్యక్తుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ప్రణాళికాబద్దంగా వ్యవహరించి అనుకున్న పనులు పూర్తి చేస్తారు.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
రుణప్రయత్నాలు ఫలిస్తాయి. బీమా, పన్నులు, గ్రాట్యుటీ, పెన్షన్ వ్యవహారాలు పూర్తవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. చిన్నారులు, ప్రియతముల కోసం ఖర్చు చేస్తారు. ఆోగ్యం పట్ల శద్ధ్ర చూపిస్తారు.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ