Horoscope : రాశిఫలాలు

ABN , First Publish Date - 2023-06-23T07:51:01+05:30 IST

నేడు (23-6-2023 - శుక్రవారం) సింహరాశి వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పారు ప్రముఖ జ్యోతిష్య పండితుడు బిజుమళ్ల బిందుమాధవ శర్మ. దూరంలో ఉన్న వ్యక్తులను వీరు నేడు కలుసుకుంటారట. ఇక దాదాపు అన్ని రాశులవారి ఫలితాలు నేడు చాలా బాగున్నాయి. కానీ కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. అవేంటో తెలుసుకుందాం.

Horoscope : రాశిఫలాలు

నేడు (23-6-2023 - శుక్రవారం) సింహరాశి వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పారు ప్రముఖ జ్యోతిష్య పండితుడు బిజుమళ్ల బిందుమాధవ శర్మ. దూరంలో ఉన్న వ్యక్తులను వీరు నేడు కలుసుకుంటారట. ఇక దాదాపు అన్ని రాశులవారి ఫలితాలు నేడు చాలా బాగున్నాయి. కానీ కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. అవేంటో తెలుసుకుందాం.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

వేడుకలు, విందులకు ఏర్పాట్లు చేస్తారు. విద్యాసంస్థల్లో ప్రవేశానికి అనుకూల సమయం. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. పొదుపు పథకాలు లాభిస్తాయి. హాస్టల్స్‌లో వసతి లభిస్తుంది. ప్రియతముల వైఖరి ఆనందం కలిగిస్తుంది.

MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు కీలక పత్రాలు అందుకుంటారు. చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. విద్యార్థులకు శుభ ప్రరం. శుభవార్త అందుకుంటారు.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక విషయాల్లో సోదరీసోదరుల సహకారం అందుకుంటారు. ప్రయాణాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. రవాణా, స్టేషనరీరంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

క్రయవిక్రయాలకు అనుకూలం. పెట్టుబడుల గురించి ఆరా తీస్తారు. విలాసాలకు ఖర్చు చేస్తారు. ఆదాయ వనరులను సమీక్షించుకుంటారు. వేడుకలకు ఖర్చు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలకు అనుకూలమైన సమయం.

MESHAM-05.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఆధ్మాత్మిక కార్యక్రమాలు, ఉత్సవాల్లో పాల్గొంటారు. దూరంలో వున్న వ్యక్తులను కలుసుకుంటారు. గత అనుభవంతో కొత్త పనులు చేపట్టేందుకు ప్రయత్నిస్తారు. సినీ, రాజకీయ, బోధన, టెక్స్‌టైల్స్‌, ఫొటోగ్రఫీ, కళల రంగాల వారికి శుభప్రదం. దుర్గాష్టక పారాయణ చేయండి.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. దూరప్రయాణాలు, విద్యాలయ ప్రవేశాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. రహస్య సమాచారం అందుకుంటారు. ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. లక్ష్మీ అష్టోత్తరనామ పారాయణ మంచిది.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. కంపెనీలు, యూనియన్‌లలో గౌరవ పదవులు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అమ్మవారి ఆలయాన్ని దర్శించండి.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

రాజకీయ, విద్యా రంగాల వారికి అనుకూలం. సమావేశాల్లో గౌరవ మన్ననలు అందుకుంటారు. వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు. రక్షణ, న్యాయ, బోధన, రవాణా రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలు ఫలిస్తాయి.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

వేడుకలు, ఉన్నత విద్య, సమావేశాలు, ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. పారితోషికాలు అందుకుంటారు. గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో అంచనాలు ఫలిస్తాయి. కనకధారా స్తోత్ర పారాయణ మంచిది.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతి కోసం విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆర్థికపరమైన సమీక్షలకు అనుకూలమైన రోజు. పూర్వ మిత్రులను కలుసుకుంటారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలం అందుకుంటారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. దుర్గాదేవి ఆలయాన్ని దర్శించండి.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

జనసంబంధాలు విస్తరిస్తాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాలు, వేడుకల్లో పాల్గొంటారు. బ్యాంకింగ్‌, రిక్రియేషన్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా వుంటుంది. కొత్త పరిచయాలు లాభిస్తాయి. భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

MESHAM-FINAL-12.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

విందు వినోదాలు, పిక్నిక్‌లు ఉల్లాసం కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో సృజనాత్మకంగా ఆలోచించి సత్ఫలితాలు సాధిస్తారు. కృషి రంగంతో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. చిన్నారులు, ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది.

- శ్రీ బిజుమళ్ల బిందుమాధవ శర్మ సిద్ధాంతి

Updated Date - 2023-06-23T08:28:05+05:30 IST