Horoscope : రాశిఫలాలు

ABN , First Publish Date - 2023-06-24T09:00:25+05:30 IST

నేడు (24-6-2023 - శనివారం) అన్ని రాశుల వారి ఫలితాలు చాలా బాగున్నాయి. అలాగే దాదాపు అన్ని రాశుల వారికి ఏదో ఒక సూచన చేశారు. ఇక ఒక రాశివారైతే సొంతింటి గురించి ఆలోచన చేస్తారట. గృహారంభ, ప్రవేశాల గురించి ఆలోచిస్తారట. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Horoscope : రాశిఫలాలు

నేడు (24-6-2023 - శనివారం) అన్ని రాశుల వారి ఫలితాలు చాలా బాగున్నాయి. అలాగే దాదాపు అన్ని రాశుల వారికి ఏదో ఒక సూచన చేశారు. ఇక ఒక రాశివారైతే సొంతింటి గురించి ఆలోచన చేస్తారట. గృహారంభ, ప్రవేశాల గురించి ఆలోచిస్తారట. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

వృత్తి, వ్యాపారాల్లో మార్పుల గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇంట్లో మార్పులు చేర్పులకు అనుకూలం. విలువైన ఫర్నీచర్‌ కొనుగోలు చేస్తారు. విందులకు అనుకూలం. వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ప్రియతములతో చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. స్టేషనరీ, రవాణా, చిట్‌ఫండ్‌ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా వుంటుంది. చిన్నారులకు సంబంధించిన ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. మహాగణపతి ఆరాధన చేయండి.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక సమీక్షలకు, సర్దుబాట్లకు అనుకూలం. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహారంభ, ప్రవేశాల గురించి ఆలోచిస్తారు. గృహ నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరం. ఇంటి కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. విష్ణు ఆరాధన శుభప్రదం.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

కమ్యూనికేషన్‌ రంగాల వారికి ప్రోత్సాహకరం. సోదరీసోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. చర్చలు ఫలిస్తాయి. అగ్రిమెంట్లు, రాతకోతలకు అనుకూలం. మెయిల్స్‌, సందేశాలు ఉల్లాసం కలిగిస్తాయి. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. రామచంద్రస్వామి ఆలయాన్ని దర్శించండి.

MESHAM-05.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి దానధర్మాలకు ఖర్చు చేస్తారు. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయు. దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. రామచంద్ర స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

బృంద కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. కొత్త పనుల ప్రారంభానికి అనుకూలం. యూనియన్‌ కార్యకలాపాలు, సహకార సంఘాల వ్యవహారాలకు అనుకూలం. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సమావేశాలు ఫలిస్తాయి. ఆంజనేయస్వామి ఆరాథన మంచిది.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ప్రముఖుల పరిచయం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు గత అనుభవం తోడ్పడుతుంది. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. సినీ, రాజకీయ రంగాల వారికి గౌరవ, ప్రతిష్ఠలు పెంపొందుతాయి. ఉన్నత పదవుల కోసం ప్రయత్నిస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించండి.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

రక్షణ, న్యాయరంగాల వారికి అనుకూలం. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రియతములతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అంచనాలు ఫలిస్తాయి. ప్రదర్శనలు ఊరేగింపులు, సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

వృత్తి, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు పూర్వ అనుభవం ఉపయోగపడుతుంది. పెద్దల ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. ఆర్థిక విషయాల్లో పెద్దల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. పరామర్శలు, సంస్మరణలకు అనుకూలం.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

సమావేశాల్లో కీలకమైన పాత్ర పోషిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. వేడుకలు, వినోదాలల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. శ్రీవారు, శ్రీమతి వ్యవహారాల్లో శుభపరిణామాలు సంభవం. సంకల్పం నెరవేరుతుంది.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

వైద్యం, ఔషధాలు, హోటల్‌, సేవల రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆహార నియమాలు పాటిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెడికల్‌ క్లెయిములు మంజూరవుతాయి. వృత్తిపరమైన సమీక్షలకు అనుకూలం.

MESHAM-FINAL-12.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

స్పెక్యులేషన్లు లాభిస్తాయి. పొదుపు పథకాలపై చక్కటి ప్రతిఫలాలు అందుకుంటారు. షాపింగ్‌, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. ప్రేమానుబంధాలు బలపడతాయి. రాములవారి ఆలయాన్ని దర్శించండి.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - 2023-06-24T09:07:08+05:30 IST