Horoscope : రాశిఫలాలు

ABN , First Publish Date - 2023-07-31T07:43:11+05:30 IST

నేడు (31-7-2023 - సోమవారం) సింహరాశికి చెందిన కొన్ని రంగాల వారికి ఆటంకాలు తప్పవట. కర్కాటక రాశి వారికి శ్రీవారు, శ్రీమతి విషయాల్లో ఖర్చులు అంచనాలు మించుతాయి. కొన్ని రాశుల వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి వారికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు నేడు ఎలా ఉన్నాయో చూద్దాం.

Horoscope : రాశిఫలాలు

నేడు (31-7-2023 - సోమవారం) సింహరాశికి చెందిన కొన్ని రంగాల వారికి ఆటంకాలు తప్పవట. కర్కాటక రాశి వారికి శ్రీవారు, శ్రీమతి విషయాల్లో ఖర్చులు అంచనాలు మించుతాయి. కొన్ని రాశుల వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి వారికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు నేడు ఎలా ఉన్నాయో చూద్దాం.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాలలు, క్రీడాసంస్థలు, ప్రకటన రంగాల వారికి అనుకూల సమయం. గోసేవ శుభప్రదం.

MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యులతో ప్రయాణాల్లో చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఫర్నీచర్‌, హార్డ్‌వేర్‌, రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు అంచనాలు ఫలించకపోవచ్చు. న్యాయ, బోధన, రక్షణ రంగాల వారు నిదానం పాటించాలి. దూరంలో ఉన్న ప్రియతమలు ఇంటికి చేరుకుంటారు.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

సన్నిహితుల ఆరోగ్యం కొంత కలవరం కలిగిస్తుంది. ఆర్థికపరమైన చర్చలు, లావాదేవీల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం. బిల్లులు, చెక్కుల అందడంలో జాప్యం వల్ల చికాకులు ఎదుర్కొంటారు. సన్నిహితులు ఆర్థిక విషయాల్లో మొహమాట పెట్టే అ వకాశం ఉంది. శివారాధన శుభప్రదం.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతి విషయాల్లో ఖర్చులు అంచనాలు మించుతాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. స్పెక్యులేషన్లకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరమైన సమావేశాలు సత్ఫలితాలను ఇ వ్వకపోవచ్చు. రుద్రకవచ పారాయణ మంచిది.

MESHAM-05.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

హోటల్‌, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలకు సంబంధించిన వారికి అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ రోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. సహోద్యోగుల కారణంగా అసౌకర్యానికి గురవుతారు. పంచాక్షరీ మంత్ర జపం మంచిది.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతములతో దూర ప్రయాణాల్లో కొంత అ సౌకర్యం కలిగే అవకాశం ఉంది. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. సినిమా, టె లి విజన్‌ క్రీడలు, పాఠశాలల రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఇంట్లో వేడుకలు, సమావేశాల్లో కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. భూమి లావాదేవీలు, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. నిధుల విషయంలో మీ ఆలోచనలను సమీక్షించుకోవడం మంచిది.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన ఓ సమాచారం కలవరం కలిగిస్తుంది. పెద్దలు, పైఅధికారులతో చర్చలు సందర్భంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. అమ్మవారి ఆలయ దర్శనం శుభప్రదం.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

రక్షణ, న్యాయ, బోధన, రవాణా రంగాల వారికి ఆర్థిక విషయాల్లో కొన్ని చిక్కులు ఎదురయ్యే అ వకాశం ఉంది. ఉన్నద విద్య, దూరప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటు కోసం అధికంగా శ్రమించాల్సి రావచ్చు. ఖ ర్చులు అంచనాలు మించుతాయి.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలించకపోవచ్చు. విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. మరమ్మతుల కోసం వెచ్చిస్తారు. మహాదేవుని ఆరాధన మంచిది.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

దూరప్రయాణాల్లో అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. సినిమా, రాజకీయ రంగాల వారికి చిక్కులు ఎదురవుతాయి. ఎగుమతులు, ఫొటోగ్రఫీ, టెక్స్‌టైల్స్‌, కన్సలె ్టన్సీ రంగాల వారికి నెమ్మదిగా పనులు పూర్తవుతాయి. గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంది.

MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక వ్యవహారాల్లో సన్నిహితుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, యూనియన్‌ కార్యకలాపాల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. వైద్య కోసం ఖ ర్చులు అధికం. విందు వినోదాల్లో పరిమితిపాటించాలి. దుర్గాదేవి ఆరాధన మంచిది.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - 2023-07-31T07:47:11+05:30 IST