Horoscope : రాశిఫలాలు

ABN , First Publish Date - 2023-06-08T08:13:56+05:30 IST

నేడు (8 - 6 - 2023 - గురువారం) కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుందట. వారిలో సింహరాశి వారు ఒకరు. ఇక ఓ రాశివారికి ఆర్థిక పరిస్థితి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందని ప్రముఖ జోతిష్య పండితుడు బిజుమళ్ల బిందుమాధవ శర్మ తెలిపారు. ఇక మొత్తంగా అన్ని రాశుల వారికి నేడు ఎలా ఉంటుందో చూద్దాం.

Horoscope : రాశిఫలాలు

నేడు (8 - 6 - 2023 - గురువారం) కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుందట. వారిలో సింహరాశి వారు ఒకరు. ఇక ఓ రాశివారికి ఆర్థిక పరిస్థితి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందని ప్రముఖ జోతిష్య పండితుడు బిజుమళ్ల బిందుమాధవ శర్మ తెలిపారు. ఇక మొత్తంగా అన్ని రాశుల వారికి నేడు ఎలా ఉంటుందో చూద్దాం.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

చిన్నారుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. బృందకార్యక్రమాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. ప్రియతముల కోసం విలువైన వుస్తువులు సమకూర్చుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. బహుమతులు అందుకుంటారు.

MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

పదిమందిలో గౌరవ, మన్ననలు అందుకుంటారు. బదిలీలు, మార్పులకు అనుకూల సమయం. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగవుతుంది. ఉన్నత పదవుల కోసం చే సే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు, చేర్పులు లాభిస్తాయి. దత్తాత్రేయ స్వామి ఆరాదన మంచిది.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. రక్షణ, న్యాయ, బోధన, రవాణా, ఆడిటింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరం. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. విద్యార్థులకు శుభప్రదం. ప్రయాణాలు చర్చలకు అనుకూలం. షిర్డి సాయి ఆరాధన మంచిది.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడుల విషయంలో ప్రోత్సాహకరంగా వుంటుంది. బీమా, పన్నులు, మ్యూచ్యువల్‌ ఫండ్‌ల గురించి ఆరా తీస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. దానధర్మాలకు ఖర్చు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. సాయిబాబా ఆలయాన్ని దర్శించండి.

MESHAM-05.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. సమావేశాల్లో, వేడుకల్లో గౌరమ, మన్ననలు అందుకంటారు. వేడుకల్లో పాల్గొంటారు. పందాలు, పోటీల్లో విజయం వరిస్తుంది. జనసంబంధాలు విస్తరిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

సినీ, రాజకీయ రంగాల వారికి సంకల్పం నెరవేరుతుంది. విదేశీ గమన యత్నాలు ఫలిస్తాయి. గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలకు సంబంధించి రహస్య సమాచారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. ప్రేమలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో ప్రియతముల సహకారం లభిస్తుంది. చిట్‌ఫండ్‌లు, బోధన, బ్యాంకింగ్‌, ప్రకటనల రంగాల వారికి ప్రోత్సాహకరం.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఉన్నత పదవులు అందుకుంటారు. పెద్దలు, తల్లిదండ్రుల సూచనలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగం విషయంలో కొత్త ఆలోచనలు చేస్తారు. పైఅధికారుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మార్పుల గురించి ఆలోచిస్తారు.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. ఏజెన్సీలు, మార్కెటింగ్‌, బోధన, రవాణా రంగాల వారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ప్రయాణాలు, చర్చలు, విద్యా విషయాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభప్రదం.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

రుణాలు మంజూరవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో శుభపరిణమాలు సంభవం. పెట్టుబడులు లాభిస్తాయి. వాయిదా పద్ధతులపై వస్తువులు కొనుగోలు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. అదనపు ఆదాయం సమకూరుతుంది.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

జనసంబంధాలు విస్తరిస్తాయి. నలుగురిని కలుపుకుని కొత్త ప్రయోగాలు చేస్తారు. భాగస్వామి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. సమావేశాలు, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది.

MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ప్రముఖుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. సహోద్యోగుల ఆంతరంగిక విషయాలు చర్చకు వస్తాయి. సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరం. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - 2023-06-08T08:31:36+05:30 IST