Horoscope : రాశిఫలాలు

ABN , First Publish Date - 2023-07-25T08:05:01+05:30 IST

నేడు (25-7-2023 - మంగళవారం) కొన్ని రాశుల వారు తప్పక చేయాల్సిన పని ఒకటి ఉంది. అది ఏంటో తెలుసుకుని పాటిస్తే ఫలితం మరింత బాగుంటుంది. ఇక దాదాపు అన్ని రాశుల వారి ఫలితం బాగానే ఉంది కానీ సూచించిన దేవతారాధన చేస్తే ఫలితం మరింత బాగుంటుంది. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Horoscope : రాశిఫలాలు

నేడు (25-7-2023 - మంగళవారం) కొన్ని రాశుల వారు తప్పక చేయాల్సిన పని ఒకటి ఉంది. అది ఏంటో తెలుసుకుని పాటిస్తే ఫలితం మరింత బాగుంటుంది. ఇక దాదాపు అన్ని రాశుల వారి ఫలితం బాగానే ఉంది కానీ సూచించిన దేవతారాధన చేస్తే ఫలితం మరింత బాగుంటుంది. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ప్రేమానుబంధాలు బలపడతాయి. శ్రీవారు, శ్రీమతి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలం అందుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు.

MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

బదిలీలు, వృత్తి, వ్యాపారాల్లో మార్పులకు అనుకూలం. వైద్యం, హోటల్‌, రిటైల్‌ వ్యాపార రంగాల వారికి ప్రోత్సాహకరం. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. విందు వినోదాలతో ఉల్లాసంగా గడుపుతారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచిది.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

చిన్నారుల విద్యా విషయంలో శుభపరిణామాలు సంభవం. బోధన, విద్యాసంస్థలు, స్టేషనరీ, రవాణా, ఏజెన్సీ రంగాల వారికి ప్రోత్సాహకరం. పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది. ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించండి.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, గృహ నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. ఇంటికి అవసరమైన ఫర్నీచర్‌ సమకూర్చుకుంటారు. ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. సుబ్రహ్మణ్య అష్టకం పారాయణ మంచిది.

MESHAM-05.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

సోదరీ సోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఇంటర్వూలలో విజయం సాధిస్తారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. విద్యార్థులకు శుభప్రదం శుభవార్త అందుకుంటారు. ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య, దూర ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. సినీ, రాజకీయ, బోధన రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. ఆర్థిక విషయాలకు సంబంధించిన సమాచారం అందుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులపై చర్చిస్తారు. గోసేవ మంచిది.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. పెట్టుబడులకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. బందుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించిన పనులు పూర్తవుతాయి. సేవాకార్యక్రమాల్లో పాల్గొనండి.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

రాజకీయ, సినీరంగ ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. విద్య, విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత పదవులు అందుకుంటారు. దుర్గామాత ఆలయాన్ని దర్శించడం మంచిది.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

సహకార సంఘాలు, యూనియన్‌ కార్యకలాపాల్లో లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి సత్ఫలితాలు సాధిస్తారు. బోధన, రక్షణ, న్యాయ, రవాణా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రదక్షిణ మంచిది.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

గతించిన వ్యక్తులను స్మరించుకుంటారు. వారసత్వ విషయాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆంజనేయ స్వామి ఆరాధన మంచిది.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. జనసంబంధాలు విస్తరిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది. వేడుకలు, శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. స్పెక్యులేషన్లు లాభిస్తాయి.

MESHAM-FINAL-12.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, చిట్‌ఫండ్‌ రంగాల వారికి వృత్తి విషయాల్లో ప్రోత్సాహకరం. లక్ష్య సాధనలో గత అనుభవం ఎంతో తోడ్పడుతుంది. మెడికల్‌ క్లెయిములు మంజూరవుతాయి. విందుల్లో పూర్వమిత్రులను కలుసుకుంటారు. గోసేవ శుభప్రదం.

- శ్రీ బిజుమళ్ల బిందుమాధవ శర్మ సిద్ధాంతి

Updated Date - 2023-07-25T08:11:25+05:30 IST