Isha Guha : కామెంటేటర్‌గా రాణిస్తున్నానంటే.. ఆ క్రెడిట్ అంతా వార్న్‌దే!
ABN , First Publish Date - 2023-03-08T00:52:45+05:30 IST
క్రికెట్ అభిమానులకు కామెంటేటర్ ఇషా గుహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఈ రంగంలో తాను నిలదొక్కుకొన్నానంటే.. ఆ క్రెడిట్ అంతా ..
క్రికెట్ వ్యాఖ్యాత ఇషా గుహ
న్యూఢిల్లీ: క్రికెట్ అభిమానులకు కామెంటేటర్ ఇషా గుహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఈ రంగంలో తాను నిలదొక్కుకొన్నానంటే.. ఆ క్రెడిట్ అంతా ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్‌దేనని ఓ ఇంటర్వ్యూలో గుహ చెప్పింది. ఇంగ్లండ్ మాజీ పేసర్ అయిన గుహ.. ఆటను వీడిన తర్వాత కామెంటేటర్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. అయితే, పూర్తిగా పురుషులే ఉండే కామెంట్రీ బాక్స్‌లో తనదైన ఉనికిని చాటుకోవడానికి మాత్రం ఎన్నో ఇబ్బందులు పడినట్టు తెలిపింది. అలాంటి సమయంలో వార్న్ ఎంతో సహాయం చేశాడని చెప్పింది. ఈ సందర్భంగా వార్న్‌కు నివాళులర్పించింది.