Revanth Reddy: కేసీఆర్ ఆరోగ్యంపై రేవంత్ తాజా ట్వీట్
ABN , First Publish Date - 2023-12-08T14:21:03+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి కేసీఅర్ ఆరోగ్యంపై (KCR Health) సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ట్వీట్ చేశారు. ‘‘మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారి ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీయడం జరిగింది.
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఅర్ ఆరోగ్యంపై (KCR Health) సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ట్వీట్ చేశారు. ‘‘మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారి ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీయడం జరిగింది. ఆసుపత్రిని సందర్శించి, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అని రేవంత్ పేర్కొన్నారు.
కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్‌ను సోమాజీగూడలోని యశోద ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. ఎడమ కాలి తుంటి మార్పిడి చేయాలని డాక్టర్లు ప్రకటించారు. కేసీఆర్‌కు సిటీ స్కాన్ చేసి ఎడమ తుంటి విరిగినట్టు వైద్యులు గుర్తించారు. సాయంత్రం 4 గంటలకు సర్జరీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో కేసీఆర్ 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు.
జానారెడ్డి పరామర్శ..
యశోద ఆస్పత్రిలో మాజీ సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయ వీర్‌రెడ్డి పరామర్శించారు. ఇప్పటికే పలువురు నేతలు కేసీఆర్‌ను పరామర్శించారు.
మంత్రి తుమ్మల ఆరా
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులనుమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.