Share News

Summer Icecream: వేసవిలో ఐస్ క్రీం తింటున్నారా లేదా ఫ్రోజెన్ డెజర్ట్ తింటున్నారా.. రెండింటికీ తేడా ఏమిటి..

ABN , Publish Date - Apr 02 , 2025 | 03:32 PM

Difference between frozen dessert and ice cream: ఎండాకాలం చల్లచల్లని ఐస్ క్రీం తినాలని అనుకోని వారుండరు. కానీ, చాలామందికి ఐస్ క్రీంకు, ఫ్రోజెన్ డెజర్ట్‌కు మధ్య తేడా తెలియదు. నిజానికి, వేసవిలో ఐస్ క్రీం ఎక్కువగా తింటే వేడి చేస్తుంది. అందుకని తెలిసో తెలియకో ఫ్రోజెన్ డెజర్ట్ తింటే..

Summer Icecream: వేసవిలో ఐస్ క్రీం తింటున్నారా లేదా ఫ్రోజెన్ డెజర్ట్ తింటున్నారా.. రెండింటికీ తేడా ఏమిటి..
Frozen desserts vs ice cream

Difference between frozen dessert and ice cream: ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ చల్లచల్లగా ఏదైనా తినాలని అనిపిస్తుంది. సమ్మర్‌లో ఎవరిని అడిగినా ముందుగా చెప్పే పేరు ఐస్ క్రీం. ఏ కాలంలో అయినా పిల్లల నుండి పెద్దల వరకు ఫేవరెట్ ఫుడ్ ఐటెం ఇదే. ఎండకాలంలో అయితే చాలా మంది ప్రతి రోజూ భోజనం తర్వాత ఐస్ క్రీం తినడానికి ఇష్టపడతారు. లంచ్ లేదా డిన్నర్ ఏదొక సమయంలో ఐస్ క్రీం తినే అలవాటు ఉంటుంది. కానీ, ఇప్పుడు మార్కెట్లో ఐస్ క్రీం కంటే ఫ్రోజెన్ డెజర్ట్‌లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయని చాలాతక్కువ మందికే తెలుసు. ఎందుకంటే చాలామందికి ఈ రెండింటికీ తేడా ఏంటో తెలీదు. ఇంతకీ ఐస్ క్రీం, ఫ్రోజెన్ డెజర్ట్ మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తాయా..


ఐస్ క్రీం, ఫ్రోజెన్ డెజర్ట్ మధ్య తేడా

  • పదార్థం

    ఐస్ క్రీం పాలు లేదా క్రీమ్ సహాయంతో తయారు చేస్తారు. కానీ, డెజర్ట్‌ల తయారీలో ఘనీభవించిన కూరగాయలు, పండ్ల ఫ్లేవర్లు ఉపయోగిస్తారు.

  • ధరలో తేడా

    పాలలోని కొవ్వు పదార్థాల ధర కిలోకు రూ. 400 ఉంటే. కూరగాయలు, పండ్ల కొవ్వు రేటు దాదాపు రూ. 100 ఉంటుంది. అందుకే ఐస్ క్రీం కంటే ఫ్రోజెన్ డెజర్ట్‌లు చౌకగా లభిస్తాయి.

  • కేలరీలు

    ఘనీభవించిన డెజర్ట్‌లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అవి లిక్విడ్ గ్లూకోజ్‌. ఇందులో పాల ఉత్పత్తుల వినియోగం తక్కువగా ఉంటుంది. అదే ఐస్ క్రీం అయితే పాల కొవ్వుతో తయారు చేస్తార. కాబట్టి ఇందులో అధిక కేలరీలు ఉంటాయి.


దుష్ప్రభావాలు

నిజానికి ఐస్ క్రీం, ఫ్రోజెన్ డెజర్ట్‌లు రెండింటిలోనూ అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. కానీ ఫ్రోజెన్ డెజర్ట్‌లలో ఐస్ క్రీం కంటే ఎక్కువ కృత్రిమ స్వీటెనర్లు ఉండవచ్చు. దీనివల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. రెండు రకాలు శరీరంలో చక్కెర, కేలరీల పరిమాణాన్ని పెంచేవే అని గుర్తుంచుకోండి.

  • జీర్ణ సమస్యలు

    ఫ్రోజెన్ డెజర్ట్‌లలో వెజిటబుల్ ఆయిల్, కృత్రిమ రుచులు ఉంటాయి. ఇది కడుపులో చికాకుకు కారణమవుతుంది. జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

  • ఊబకాయం

    ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉండే ఫ్రోజెన్ డెజర్ట్‌లను తయారు చేయడానికి హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్‌ను ఉపయోగిస్తారు. గుండె జబ్బులు, ఊబకాయం, కొలెస్ట్రాల్ పెరగడానికి ట్రాన్స్ ఫ్యాట్స్ కారణమని మీకు తెలుసా. ఇది శరీర జీవక్రియ రేటును మందగింపజేస్తుంది. క్రమంగా ఊబకాయ సమస్యకు దారితీస్తుంది.


ఘనీభవించిన డెజర్ట్‌లను ఎలా గుర్తించాలి

ఘనీభవించిన డెజర్ట్‌ను గుర్తించడం చాలా సులభమైన.దీని ప్యాకేజింగ్‌పై పదార్థాల తయారీకి వాడిన జాబితాను చదవండి. పాలకు బదులుగా వెజిటబుల్ ఆయిల్ అని ఉంటే అది ఐస్ క్రీం కాదు.. ఫ్రోజెన్ డెజర్ట్ అని అర్థం చేసుకోండి.


Read Also: Kitchen Hacks: మీరు కొంటున్న కందిపప్పు నిజమైనదా లేదా నకిలీదా.. తెలుసుకునేందుకు కొన్ని చిట్కాలు..

Heat relief solutions: సమ్మర్‌లో శరీర వేడి తగ్గేందుకు కొన్ని చిట్కాలు..

Relationship Tips: మీ భార్యను ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారా..

Updated Date - Apr 02 , 2025 | 03:34 PM