AP Police Search For Kakani: హైదరాబాద్‌లోని కాకాణి నివాసానికి ఏపీ పోలీసులు..
ABN , Publish Date - Apr 02 , 2025 | 03:31 PM
AP Police Search For Kakani: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం ఏపీ పోలీసులు హైదరాబాద్‌కు వచ్చారు. పక్కా సమాచారంతో హైదరాబాద్‌కు వచ్చినప్పటికీ పోలీసులకు నిరాశే ఎదురైంది.

అమరావతి, ఏప్రిల్ 2: మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధ రెడ్డి (Former Minister Kakani Goverdhan Reddy) కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్‌లోని (Hyderabad) కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటికి ఏపీ పోలీసులు వెళ్లారు. కాకాణిపై అక్రమ మైనింగ్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు అయ్యింది. ఇప్పటికే విచారణకు రావాలంటూ కాకాణికి రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ విచారణకు మాజీ మంత్రి డుమ్మా కొట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని కాకాణి ఇంటికి ఏపీ పోలీసులు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అక్రమమైనింగ్‌కు సంబంధించి రెండు సార్లు కాకాణికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. నిన్న (మంగళవారం) మాజీ మంత్రి విచారణకు రావాల్సి ఉంది. అయితే నిన్నటి విచారణకు కాకాణి గైర్హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకున్న ఏపీ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. హైదరాబాద్‌లో కాకాణికి మూడు నివాసాలు ఉన్నాయి. ఎస్‌ఆర్‌నగర్‌లోని నివాసానికి నెల్లూరు జిల్లా కావలి సీఐతో పాటు మనుబోలు ఎస్‌ఐ, సిబ్బంది వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నెల్లూరు పోలీసులు కాకాణిని కలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన తప్పించుకుని తిరుగుతున్న పరిస్థితి. ప్రధానంగా పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు చూడగా.. ఆయన ఒక దగ్గర ఉండి మరో చోటు చెబుతూ తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. వివిధ రకాలుగా పోలీసులు ఆయన తప్పుదోపట్టిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈరోజు కాకాణి నివాసంలో ఓ ఫంక్షన్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడే కాకాణి ఉన్నట్లు భావించిన ఏపీ పోలీసులు.. అక్కడకు చేరుకున్నారు. అయితే కాకాణి అక్కడ లేనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన బంధువులకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏ సమయానికి విచారణకు రావాలి అన్న అంశాలను అందులో స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం కాకాణి ఇంట్లో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరుగుతుండగా.. పోలీసు రావడంతో ఫంక్షన్‌లో ఒక్కసారి కలవరం మొదలైంది.
Kakani: మాజీ మంత్రి కాకాణి హైడ్రామా.. పోలీసులకు సవాళ్లు...
పరారీలో ఉంటూనే అక్రమైనింగ్ కేసు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు మాజీ మంత్రి. ఈ క్రమంలో విచారణకు పిలిచేందుకు పోలీసులు ప్రయత్నించగా.. తాను విచారణకు అందుబాటులోకి వస్తానని.. పోలీసులకు సహకరిస్తానని చెబుతూనూ పలుమార్లు విచారణకు కాకాణి డుమ్మా కొట్టారు. ఆయన మొబైల్ సిగ్నల్ ఆధారంగా కాకాణి ఎక్కడున్నారో తెలుసుకుని అక్కడికెళ్లి నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఆయన ఓ చోట ఉండగా.. ఫోన్ సిగ్నల్స్ మరోచోట చూపిస్తున్నాయి. మొబైల్ సగ్నల్ ఆధారంగా వెళ్తున్న పోలీసులకు నిరాశే ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో పక్కా సమాచారంతో హైదరాబాద్‌లో ఉన్నట్లు ఏపీ పోలీసులు గుర్తించి వెళ్లి చూడాగా.. అక్కడకు కూడా కాకాణి అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన బంధువులకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
Ameenpur Case Twist: అమీన్‌పూర్ కేసులో ట్విస్ట్.. బయటపడ్డ కన్నతల్లి బాగోతం
CM Chandrababu On Tirumala: తిరుమలలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్ష
Read Latest AP News And Telugu News