Waqf Amendment Bill: బిల్లులో ఒకే మార్పును కోరనున్న టీడీపీ.. అదేమిటంటే
ABN , Publish Date - Apr 02 , 2025 | 03:25 PM
బిల్లులో మహిళల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాలనే సవరణతో సహా అన్ని సవరణలకు టీడీపీ సానుకూలంగా ఉంది. వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా పార్టీ ఎంపీలంతా తప్పనిసరిగా సభకు హాజరుకావాలని మూడులైన్ల విప్‌ను కూడా టీడీపీ జారీ చేసింది.

న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లు 2024 (Waqf Amendment Bill)పై బుధవారంనాడు లోక్‌సభలో చర్చ మొదలుకావడంతో కొత్తం చట్టం పార్లమెంటులో ఆమోదం పొందుతుందా అనే దానిపైనే అందరి దృష్టి ఉంది. ఎన్డీయేలో కీలక భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనతాదళ్ (యునైటెడ్) పార్టీలు బిల్లుకు సానుకూలంగా ఉన్నాయి. అయితే ప్రతిపాదిత బిల్లులో చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ఒక మార్పును సూచించే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.
Waqf: అసలేంటీ వక్ఫ్ బిల్లు, విపక్షాల రాద్ధాంతం దేనికి?
స్టేట్ వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరులను అనుమతించాలని టీడీపీ కోరనున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. ముస్లిమేతరులకు బోర్డులో ప్రాతినిధ్యం కల్పించడం అనేది రాష్ట్రాల విచక్షణకు వదిలిపెట్టాలని పార్టీ ఏకగ్రీవ డిమాండ్‌గా ఉందని ఆ వర్గాలు తెలిపాయి. ఆ ఒక్క మార్పు మినహాయిస్తే బిల్లులో మహిళల భాగస్వా్మ్యాన్ని తప్పనిసరి చేయాలనే సవరణతో సహా అన్ని సవరణలకు టీడీపీ సానుకూలంగా ఉంది. వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా పార్టీ ఎంపీలంతా తప్పనిసరిగా సభకు హాజరుకావాలని మూడులైన్ల విప్‌ను కూడా టీడీపీ మంగళవారంనాడు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి..
Lalu Prasad Yadav: లాలూ ఆరోగ్యం ఆందోళనకరం.. నిమ్స్‌లో చేరే అవకాశం
Line of Control: పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
For National News And Telugu News