15 ఏళ్ల కుర్రాడిపై కన్నేసిన టీచరమ్మ
ABN , Publish Date - Apr 02 , 2025 | 03:39 PM
US Teacher And Student: ఆ టీచర్ 15 ఏళ్ల బాలుడిపై కన్నేసింది. అతడితో చాలా చనువుగా ఉండేది. ఇద్దరూ ఫోన్‌లో గంటలు గంటలు మాట్లాడుకునే వారు. చాటింగులు చేసుకునే వారు. ఓ రోజు బాలుడి తల్లి ఆ ఫోన్ చాటింగులను చూసింది.

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే గాడితప్పుతున్నారు. విద్యార్థుల్ని కన్న బిడ్డల్లా చూసుకోవాల్సింది పోయి.. వారిపైనే కన్నేస్తున్నారు. తమ కామ దాహానికి వారిని బలి చేస్తున్నారు. మగ ఉపాధ్యాయులు.. బాలికలను లైంగికంగా వేధించటం అన్నది తరచుగా ఎక్కడో ఓ చోట జరుగుతూ ఉంటుంది. కానీ, మహిళా ఉపధ్యాయులు బాలురను లైంగికంగా వేధించే సంఘటనలు అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటాయి. అలాంటి అత్యంత అరుదైన ఘటనే అమెరికాలో చోటుచేసుకుంది. ఓ టీచరమ్మ 15 ఏళ్ల బాలుడిపై కన్నేసింది. అతడ్ని లైంగికంగా వేధించింది. చివరకు పాపం పండి జైలు పాలు అయింది.
సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన 30 ఏళ్ల క్రిస్టినా ఫార్మెల్లా డౌనర్స్ గ్రూవ్ సౌత్ హై స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తూ ఉండేది. ఆ స్కూల్లో చదివే 15 ఏళ్ల బాలుడిపై ఆమె కన్నేసింది. డిసెంబర్ 2023 నుంచి అతడ్ని లైంగికంగా వేధించటం మొదలెట్టింది. మార్చి నెలలో బాలుడి ఫోన్‌ను అతడి తల్లి చెక్ చేసింది. అప్పుడు క్రిస్టినా.. బాలుడి మధ్య జరిగిన 18 ప్లస్ చాటింగ్ కంట పడింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మార్చి 16న కారులో భర్తతో పాటు వెళుతున్న క్రిస్టినాను అడ్డగించారు. అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
విచారణ చేశారు. విచారణ సందర్భంగా క్రిస్టినా మాట్లాడుతూ.. ‘ నేను చాలా అందంగా ఉంటాను. నా అందానికి ఎవ్వరూ సాటి లేరు. నేను చాలా మంచిదాన్ని. ఆ బాలుడ్ని చాలా బాగా చూసుకునే దాన్ని. అతడు నాకు తెలియకుండా నా ఫోన్ తీసుకున్నాడు. నా ఫోన్ నుంచి.. అతడి ఫోన్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుకున్నాడు. తర్వాత నా ఫోన్‌లో మెసేజ్‌లు డిలేట్ చేశాడు. నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్లాన్ చేశాడు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమెను కండీషన్ బెయిల్ మీద విడుదల చేశారు. ఏప్రిల్ 14వ తేదీన ఆమె కోర్టులో హాజరు కానుంది. నేరం రుజువైతే ఆమెకు కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
AP Police Search For Kakani: హైదరాబాద్‌లోని కాకాణి నివాసానికి ఏపీ పోలీసులు..