Share News

Anant Ambani: కోళ్ల లారీని కొనేసిన అనంత్ అంబానీ.. ఎందుకో తెలిస్తే వారెవ్వా అనాల్సిందే..

ABN , Publish Date - Apr 02 , 2025 | 02:56 PM

Anant Ambani Hens Viral Video: దిగ్గజ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ మరోమారు తన దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ద్వారకకు పాదయాత్రగా వెళుతున్న అనంత్ ఒక కోళ్ల లారీని కొన్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.

Anant Ambani: కోళ్ల లారీని కొనేసిన అనంత్ అంబానీ.. ఎందుకో తెలిస్తే వారెవ్వా అనాల్సిందే..
Anant Ambani Hen Viral Video

Anant Ambani Hens Viral Video: తండ్రి ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, దిగ్గజ పారిశ్రామికవేత్త అయినా అనంత్ అంబానీ నా రూటే సపరేటు అన్నట్టుగా ఉంటాడు. ప్రకృతి, జంతువులు, పక్షుల పరిరక్షణ కోసం ఇప్పటికే గుజరాత్ జామ్‌నగర్‌లో వంతారా జంతు సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని నిర్మించి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు మరోసారి మూగజీవాల పట్ల తన మమకారాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం జామ్‌నగర్ నుంచి ద్వారక వరకు 140 కి.మీ. పాదయాత్ర చేస్తున్నాడు అనంత్. ఏప్రిల్‌ 10వ తేదీన ఆయన 30వ పుట్టినరోజు. అప్పటికల్లా ద్వారకానాథుని చేరుకోవాలనే లక్ష్యంతో గత 5 రోజులుగా రోజుకు 10 నుంచి 12 కిలోమీటర్ల వరకూ నడుస్తున్నారు. ఇప్పటికే 60 కిలోమీటర్ల యాత్ర పూర్తిచేశారు.


250 కోళ్లను కొన్న అనంత్ అంబానీ..

అనంత్ అంబానీ పాదయాత్రకు సంబంధించిన వీడియోలు కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా మరో వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. జామ్‌నగర్ నుంచి ద్వారకకు రోడ్డుపై పాదయాత్రగా వెళ్తున్న అనంత్ అంబానీని దారిలో ఓ కనిపించిన ఓ దృశ్యం ఆకర్షించింది. కోళ్లతో కిక్కిరిసి ఉన్న ఓ లారీ కబేళాకు వెళుతుండటం చూసి చలించిపోయాడు. వెంటనే తన సిబ్బందిని పిలిచి ఆ లారీని ఆపమని ఆదేశించాడు. కోళ్లను సంరక్షించేందుకు వ్యాపారికి డబ్బులు చెల్లించి వాటిని కొనుగోలు చేశాడు. వందలాది కోళ్లను సంరక్షణ కేంద్రంలో ఉంచేందుకు చొరవ తీసుకున్న అనంత్ దయార్ద్ర హృదయానికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.


Read Also: Hotel Room Secrets: హోటల్ బాత్రూమ్‌లలో ల్యాండ్‌లైన్ ఫోన్లు ఎందుకు ఉంటాయి..అసలు కారణమిదే..

Scorpion farming: తేలు విషానికి ఎందుకంత డిమాండ్..ఈ వీడియో చూస్తే అసలు మ్యాటర్‌ మీకే అర్థమవుతుంది..

Snake Viral Video: ఈ పాము మరీ కామెడీగా ఉందే.. బాత్‌రూంలోకి వెళ్లిన వ్యక్తిని ఎలా భయపెట్టిందో చూస్తే..

Updated Date - Apr 02 , 2025 | 03:00 PM