Share News

Madhuyashki: కేసీఆర్ ఆ విషయంలో పావులు కదుపుతున్నారు

ABN , First Publish Date - 2023-12-01T20:17:04+05:30 IST

ఆర్ఎస్ ప్రభుత్వం ( BRS GOVT ) ధరణిలో ఉన్న భూములను రాత్రికి రాత్రే పేర్లు మారుస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ ( Madhuyashkigoud ) వ్యాఖ్యానించారు.

Madhuyashki: కేసీఆర్  ఆ విషయంలో పావులు కదుపుతున్నారు

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం ( BRS GOVT ) ధరణిలో ఉన్న భూములను రాత్రికి రాత్రే పేర్లు మారుస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ ( Madhuyashkigoud ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నందుకు టీపీసీసీ ప్రచార కమిటీ పక్షాన ధన్యవాదములు. తెలంగాణలో రేపు వస్తున్న విజయం తెలంగాణ ప్రజల విజయం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌ను వీడుతున్నాడు. అందులో ఎలాంటి సందేహం లేదు పక్క సమాచారం అందింది.రైతులకు సబ్సిడీలు ఇవ్వకుండా రైతుబంధు డబ్బులు రూ. 5,000 కోట్లను దారి మల్లిచేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నట్టు సమాచారం ఉంది’’ మధుయాష్కీగౌడ్ అని ఎద్దేవ చేశారు.

కల్వకుంట్ల కుటుంబాన్ని వదిలిపెట్టేది లేదు

‘‘రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను సపోర్ట్ చేస్తున్న అధికారులు, కాంట్రాక్టర్లు ఆరిపోతున్న దీపానికి సహాకరిస్తే మీ బతులు ఆగం కావాడం ఖాయం. రాష్ట్రంలో జరిగిన అవినీతిపై కల్వకుంట్ల కుటుంబాన్ని వదిలిపెట్టేది లేదు. సోదరి కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన అవినీతి సొమ్ముపై కూడా విచారణ జరిపిస్తాం. అవినీతికి సహకరించే అధికారులు సైతం జైలుకు వెళ్లడం తప్పదు. ప్రగతిభవన్ నుంచి తరలుతున్న కోట్ల రూపాయల అవినీతి సొమ్మును అధికారులు కట్టడి చేయాలి. కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు దండుకోనేందుకు అధికారంలోకి వస్తాం. దేశంలో ఉద్యమ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీకి ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడివి. బీజేపీ పార్టీకి కూడా స్వాతంత్రo ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయో ప్రజలు గమనించాలి’’ అని మధుయాష్కీ సూచించారు.

Updated Date - 2023-12-01T20:17:13+05:30 IST