Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకార సమయంలో మార్పు.. ఎప్పుడంటే..!
ABN , First Publish Date - 2023-12-06T12:04:56+05:30 IST
రేవంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార సమయంలో మార్పు జరిగింది. తొలుత గురువారం ఉదయం 10:28 నిమిషాలకు నిర్ణయించారు. కానీ తాజాగా ఆ సమయాన్ని ఛేంజ్ చేశారు.
హైదరాబాద్: రేవంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార సమయంలో మార్పు జరిగింది. తొలుత గురువారం ఉదయం 10:28 నిమిషాలకు నిర్ణయించారు. కానీ తాజాగా ఆ సమయాన్ని ఛేంజ్ చేశారు. మరో ముహూర్తం ఖరారైంది. గురువారం మధ్యాహ్నం 1:04 నిమిషాలకు తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రమాణస్వీకారం చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి రెండో సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలంతా తరలిరానున్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, అభిమానులు, కార్యకర్తలంతా పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్.శాంతికుమారి అధికారులకు ఆదేశించారు.
ఇదిలా ఉంటే మంగళవారం సాయంత్రం రేవంత్‌రెడ్డిని.. తెలంగాణ సీఎంగా కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. ప్రకటన వెలువడగానే రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. హస్తిన టూర్‌లో ఉన్న రేవంత్ బిజిబిజీగా గడుపుతున్నారు. కాంగ్రెస్ పెద్దలను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కేసీ.వేణుగోపాల్, తదితర నేతలను రేవంత్ కలిశారు. ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా నేతలను రేవంత్ ఆహ్వానించారు.
ఈ ప్రమాణస్వీకారానికి విపక్ష పార్టీ నేతలను, ప్రాముఖ్యంగా అమరవీరుల కుటుంబాలను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. అంతేకాకుండా ఏపీ, తమిళనాడు, కర్ణాటక సీఎంలను కూడా రేవంత్ ఆహ్వానించనున్నారు. అలాగే సినీ ప్రముఖులతో పాటు మేధావులను కూడా పిలువనున్నారు.