Share News

Siddaramaiah : కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలది అబద్ధపు ప్రచారం

ABN , First Publish Date - 2023-11-26T15:15:29+05:30 IST

ర్నాటక కాంగ్రెస్ ( Karnataka Congress ) ప్రభుత్వంపై బీఆర్ఎస్ ( BRS ) , బీజేపీ ( BJP ) నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ( Siddaramaiah ) వ్యాఖ్యానించారు.

Siddaramaiah : కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలది అబద్ధపు ప్రచారం

హైదరాబాద్: కర్నాటక కాంగ్రెస్ ( Karnataka Congress ) ప్రభుత్వంపై బీఆర్ఎస్ ( BRS ) , బీజేపీ ( BJP ) నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ( Siddaramaiah ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు తాజ్‌కృష్ణా హోటల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘కర్నాటకలో సమస్య ఉంటే హైదరబాద్‌లో ప్రొటెస్ట్ చేస్తారా. కర్ణాటక రైతుల పేరుపై తెలంగాణలో నిరసన చేసేవాళ్లు కర్ణాటక రైతులు కాదు. సీఎం కేసీఆర్‌ని కర్ణాటకకు రమ్మని ఓపెన్ ఛాలెంజ్ చేశాను. కానీ రాలేదు. ఈరోజు కూడా కేసీఆర్‌ని కర్ణాటక రమ్మని ఆహ్వానిస్తున్నాను. కేసీఆర్ కర్ణాటక వచ్చి అక్కడి ప్రభుత్వ పాలన చూడాలి. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కర్నాటక వచ్చి ఆ రాష్ట్ర అభివద్ధిని చూడాలని కోరుతున్నాను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తీరుతుంది. తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు తప్పకుండా అమలు అవుతాయి. కర్ణాటకలో మేం ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడం లేదని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు’’ అని సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల కోసం కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారు

కేసీఆర్, కేటీఆర్, బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం అబద్ధం. గ్యారెంటీ స్కీంల అమలు కోసం మేం ప్రమాణస్వీకారం చేసిన రోజే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. కర్ణాటకలో మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఎన్నికల కోసం కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పటికే నాలుగు గ్యారెంటీ పథకాలు కర్ణాటక రాష్ట్రంలో అమలవుతున్నాయి. ఇంకో గ్యారెంటీ పథకాన్ని కర్ణాటక రాష్ట్రంలో జనవరిలో మొదలు పెడతాం. గ్యారెంటీ పథకాలకు బడ్జెట్ కేటాయిస్తాం.కర్ణాటకలో మా కంటే ముందున్న బీజేపీ ప్రభుత్వం 600 హామీలు ఇచ్చి, కనీసం 10 శాతం కూడా హామీలను కూడా అమలు చేయలేకపోయింది. కర్ణాటకలో ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయలేరని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. బిల్డర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చేస్తున్న ప్రచారం అబద్ధం. మాజీ సీఎం యాడ్యురప్ప అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. కర్ణాటకలో గత బీజేపీ ప్రభుత్వం 40% కమీషన్ తీసుకుందని కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆరోపించింది’’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-26T16:06:17+05:30 IST