TS Elections: కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి.. గజ్వేల్‌లో స్వల్ప మెజార్టీ...!
ABN , First Publish Date - 2023-11-30T18:22:24+05:30 IST
తెలంగాణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. బీఆర్ఎస్ శ్రేణుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఏకంగా బీఆర్ఎస్ బాస్ సీఎం కేసీఆర్‌కే ఓటమి తప్పదని ఆరా మస్తాన్ సర్వే వెల్లడించింది. కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మతంగా తీసుకున్న కామారెడ్డి నియోజకవర్గంలో ఓటమి తప్పదని సర్వేలో వెళ్లడైంది. అలాగే...
తెలంగాణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. బీఆర్ఎస్ శ్రేణుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఏకంగా బీఆర్ఎస్ బాస్ సీఎం కేసీఆర్‌కే ఓటమి తప్పదని ఆరా మస్తాన్ సర్వే వెల్లడించింది. కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మతంగా తీసుకున్న కామారెడ్డి నియోజకవర్గంలో ఓటమి తప్పదని సర్వేలో వెళ్లడైంది. అలాగే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే వెల్లడించింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి వెంటకరమణా రెడ్డి గెలిచే అవకాశం ఉందని తెలిసింది.
మరోవైపు గజ్వేల్‌లో కేసీఆర్ స్వల్ప మెజారిటీతో గెలుపొందుతారని ఆరా మస్తాన్ సర్వే సంస్థ తెలపడంతో బీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 119 నియోజకవర్గాలకు గాను మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.