Vijayashanti: కేసీఆర్ నాటిన మొక్క బీజేపీని నాశనం చేసింది
ABN , First Publish Date - 2023-11-18T13:47:25+05:30 IST
సీఎం కేసీఆర్ ( CM KCR ) నాటిన ఒక మొక్క బీజేపీ ( BJP ) పార్టీని నాశనం చేసిందని.. ఆ వ్యక్తిపై కేసీఆర్ పెట్టిన కేసులు ఏమయ్యాయి?.. బీజేపీ దానికదే నాశనం అయిందని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి ( Vijayashanti ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ ( CM KCR ) నాటిన ఒక మొక్క బీజేపీ ( BJP ) పార్టీని నాశనం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి ( Vijayashanti ) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి ఈటల రాజేందర్‌ని ఉద్దేశించి రాములమ్మ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈటలపై కేసీఆర్ పెట్టిన కేసులు ఏమయ్యాయి?.. బీజేపీ దానికదే నాశనం అయిందని విజయశాంతి అన్నారు. శనివారం నాడు ఆమె గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బండి సంజయ్‌ని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మార్చడంతోనే బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. బండి సంజయ్‌ని సడెన్‌గా తీసేశారు. బండి సంజయ్‌ని తీసేయవద్దని చెప్పాను.సంజయ్‌ని తీసివేయడం లేదని మాకు చెప్పి సడన్‌గా అధ్యక్ష పదవీ నుంచి తప్పించారు. బీజేపీ తప్పు చేసింది కాబట్టే కాంగ్రెస్ పార్టీలో చేరాను. తెలంగాణ కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను.
ఉద్యమకారులకు బీజేపీ మాట ఇచ్చింది. కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని బీజేపీ నమ్మకాన్ని ఇచ్చింది కాబట్టే ఆ పార్టీలోకి వెళ్లాను. బీజేపీలోకి వెళ్లి నెలలు, సంవత్సరాలు గడిచినా కేసీఆర్‌పై చర్యలు తీసుకోలేదు. కేసీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదని మోదీనే అడుగుతున్నా. ఆధారాలు ఉన్నా కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. మోదీ, షా, నడ్డా తెలంగాణకి వచ్చినప్పుడల్లా కేసీఆర్‌పై ఆరోపణలు చేశారు. కానీ చర్యలు తీసుకోలేదు.మోదీకి మెజారిటీ ఉన్నా కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు’’ అని విజయశాంతి ప్రశ్నించారు.
బీఆర్ఎస్, బీజేపీ నాపై మీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నారు
‘‘బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే. బీజేపీ కార్యకర్తలు పిచ్చోళ్లు. బీజేపీ బయటకి మాట్లాడేది ఒకటి. తెర వెనుక జరిగేది ఒకటి. కేసీఆర్ అవినీతిపై కాంగ్రెస్ పోరాడుతోంది. కాళేశ్వరంపై బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. కొందరు మీడియా వ్యక్తులు నాపై ఘాటైన హెడ్‌లైన్స్ పెట్టారు. నన్ను తిట్టే హక్కు మీకు ఎక్కడిది. కేసీఆర్ ఇచ్చే డబ్బులకి లొంగిపోయే వ్యక్తిని కాదు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి నాపై మీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకి మంచి బుద్ధి రావాలని కోరుకుంటున్నాను.
నన్ను విమర్శించే వాళ్లు నోరు అదుపులో పెట్టుకోవాలి. కేసీఆర్ నన్ను సస్పెండ్ చేశారు. నేనే రాజీనామా చేశానని ప్రచారం చేశారు. కేసీఆర్‌ని గద్దె దింపడం కోసం ఎంత దూరమైనా వెళ్తా. ఆనాటి కాంగ్రెస్ నాయకుల్లో కొంతమందిని కేసీఆర్ కొన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. మా పార్టీ వాళ్లని కలుసుకోవడం ఆనందంగా ఉంది’’ అని విజయశాంతి అన్నారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి