Assembly లాబీలో సరదా సన్నివేశం

ABN , First Publish Date - 2023-02-03T13:17:40+05:30 IST

అసెంబ్లీ లాబీలో సరదా సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకు కడియం శ్రీహరికి మధ్య సరదా సంభాషణ జరిగింది. ఎర్రబెల్లికి బీఆర్‌ఎస్ కండువాను కడియం కప్పారు.

Assembly లాబీలో సరదా సన్నివేశం

హైదరాబాద్ : అసెంబ్లీ (Telangana Assembly) లాబీలో సరదా సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు (Minister Errabelli Dayakar Rao)కు కడియం శ్రీహరి (Kadiam Srihari)కి మధ్య సరదా సంభాషణ జరిగింది. ఎర్రబెల్లికి బీఆర్‌ఎస్ (BRS) కండువాను కడియం కప్పారు. ఆపై తమ పార్టీ బీఆర్ఎస్‌లోకి ఎర్రబెల్లిని ఆహ్వానిస్తున్నామని చెప్పడంతో అక్కడున్న వారు తొలుత అవాక్కైనా ఆ తరువాత సరదాగా నవ్వుకున్నారు.

అంతకు ముందు అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర చర్చ కొనసాగింది. సొంత స్థలం ఉన్నవారికి ఆర్థిక సాయం విషయంలో ఉదారంగా వ్యవహరించాలని ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ ఒక్కో నియోజకవర్గంలో.. 4 వేల మందికి ఇంటి నిర్మాణ సాయం అందిస్తే బాగుంటుందని అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో కొన్ని మార్పులు చేర్పులు అవసరమని.. లేకుంటే నియోజకవర్గాల్లో ఇబ్బందులు తప్పవని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై (Governer Tamil Sai)కి నమస్కరించి సీఎం కేసీఆర్‌ (CM KCR) స్వాగతం పలికారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. 40 నిమిషాల పాటు ఆమె ప్రసంగం కొనసాగింది. ‘పుట్టుక నీది చావు నీది.. బ్రతుకంతా దేశానిది అంటూ కాళోజీ కొటేషన్ తో ప్రసంగాన్ని గవర్నర్ తమిళ సై ప్రారంభించారు. ‘కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో.. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో’ అంటూ కవి దాశరథి గేయంతో ప్రసంగాన్ని ముగించారు.

Updated Date - 2023-02-03T13:17:41+05:30 IST