Marri Shasidhar Reddy: ఓటర్ల సవరణలో తప్పులు
ABN , First Publish Date - 2023-09-13T18:21:01+05:30 IST
తెలంగాణ(Telangana)లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగుతాయని..ఓటర్ల సవరణలో తప్పులు జరుగుతున్నాయని బీజేపీ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి(Marri Shasidhar Reddy) వ్యాఖ్యానించారు.

ఢిల్లీ: తెలంగాణ(Telangana)లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగుతాయని..ఓటర్ల సవరణలో తప్పులు జరుగుతున్నాయని బీజేపీ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి(Marri Shasidhar Reddy) వ్యాఖ్యానించారు.బుధవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను తెలంగాణ బీజేపీ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, తదితరులు కలిశారు. ఈ సందర్భంగా మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ..‘‘తెలంగాణ ఓటర్ల జాబితా(Telangana Voters List) లో అనుమతులు లేకుండా సవరణలు జరుగుతున్నాయని పిర్యాదు చేశాం.రాష్ట్రంలో ఓటర్ల సవరణ కొనసాగుతోంది. ఒకే కుటుంబానికి చెందిన వారిని వేర్వేరు పోలింగ్ స్టేషన్లలో ఓటర్లుగా చేరుస్తున్నారు.ఓటు తీసేయడం లేదు, వేరే చోటుకు ఓటును మార్పు చేస్తున్నారు. ఎన్నికల సంఘం నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. నిబంధనలను లెక్క చేయకుండా దుర్మార్గంగా ఓటర్ లిస్ట్‌లో సవరణలు జరుగుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు విజ్ఞప్తి చేశాం. తెలంగాణలో స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని కోరాం. స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఓటర్ లిస్ట్ సవరణ జరగాలి. ఓటరు లిస్ట్‌లో మీ ఓటు ఎక్కడ ఉందో ప్రజలే చెక్ చేసుకోవాలి. ఎన్నికల సంఘం చూస్తూ ఊరుకోవద్దని చెప్పాం.గత ఎన్నికల్లో 20 లక్షల ఓట్లు గల్లంతు అయ్యాయి.43 నియోజకవర్గాల్లో దాదాపు 70 వేల ఓట్లు వేర్వేరు చోట్ల ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో జరగిన సమావేశంలో జమీలీ ఎన్నికలపై చర్చ జరగలేదు’’ అని మర్రి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు.