Share News

PM Modi: బీసీ గర్జన సభలో‌ మోదీ కీలక ప్రకటన..!

ABN , First Publish Date - 2023-11-07T09:03:16+05:30 IST

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎల్బీ స్టేడియంలో బీసీ‌ గర్జన సభలో మోదీ ప్రసంగించనున్నారు. ఈ సందర్బంగా కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

PM Modi: బీసీ గర్జన సభలో‌ మోదీ కీలక ప్రకటన..!

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) మంగళవారం తెలంగాణ (Telangana) పర్యటనకు రానున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎల్బీ స్టేడియం (LB Stadium)లో బీసీ‌ గర్జన సభ (BC Garjan Sabha)లో మోదీ ప్రసంగించనున్నారు. ఈ సందర్బంగా కీలక ప్రకటన (Key Announcement) చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత (Janasena Chief) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పాల్గొంటారు. కాగా ఈనెల 11న‌‌ మరోసారి రాష్ట్రానికి ప్రధానమంత్రి రానున్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. ఎస్సీ వర్గీకరణపై ‌మోదీ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఈ కార్యక్రమంలో మంద కృష్ణ మాదిగ పాల్గొననున్నారు.

ప్రధాని అధికారిక షెడ్యూల్..

మంగళవారం సాయంత్రం 5.05 గంటలకు యూపీ ప్రయాగ్ రాజ్ నుంచి హైదరాబాద్ బేగంపేట్‌కు ప్రధాని మోదీ వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 5.25 గంటలకు ఎల్బీ స్టేడియంకు చేరుకుంటారు. 5.30 గంటల నుంచి 6.10 గంటల వరకు బీసీ గర్జన సభలో ప్రసంగిస్తారు. 6.15 గంటలకు రోడ్డు మార్గంలో బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని 6.35 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.

నేడు పార్కులు బంద్..

కాగా ఎల్‌బీ స్టేడియంలో ప్రధాని మోదీ బీసీ‌ గర్జన సభ నేపథ్యంలో మంగళవారం ఆ మార్గంలో ఉన్న ఎన్టీఆర్‌ గార్డెన్‌, లుంబినీ పార్కులను మూసివేయనున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు ప్రకటించారు. మోదీ రాజ్‌భవన్‌ నుంచి రోడ్డు మార్గంలో ఖైరతాబాద్‌ జంక్షన్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌, లిబర్టీ మీదుగా స్టేడియానికి చేరుకోనున్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా పార్కులు మూసివేయాలని పోలీస్‌ ఉన్నతాధికారులు సూచించినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2023-11-07T09:03:18+05:30 IST