KCR : గద్దర్ అంతక్రియల్లో కేసీఆర్ పాల్గొంటారా?
ABN , First Publish Date - 2023-08-07T08:38:56+05:30 IST
ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆదివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. నేటి ఉదయం 11గంటలకు ఆయన అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. అయితే ఎల్బీ స్టేడియంలో అభిమానుల తాకిడి పెద్దగా కనిపించడం లేదు. కుటుంబ సభ్యులతో పాటు కొద్దీ మంది కళాకారులు మాత్రమే ఎల్బీ స్టేడియంలో కనిపిస్తున్నారు.
హైదరాబాద్ : ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆదివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. నేటి ఉదయం 11గంటలకు ఆయన అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. అయితే ఎల్బీ స్టేడియంలో అభిమానుల తాకిడి పెద్దగా కనిపించడం లేదు. కుటుంబ సభ్యులతో పాటు కొద్దీ మంది కళాకారులు మాత్రమే ఎల్బీ స్టేడియంలో కనిపిస్తున్నారు. అయితే తొలుత గద్దర్ అంత్యక్రియలకు సీఎం కేేసీఆర్ హాజరవుతారా? లేదా? అనే సందేహం ఉండేది. కానీ ఇప్పుడు హాజరవుతారనే తెలుస్తోంది.
పెత్తందారీల పాలిట బందూకుగా.. అణగారిన వర్గాలకు బాసటగా నిలిచిన గుమ్మడి విఠల్(Gummadi Vitthal) అలియాస్ గద్దర్( Gaddar) (74) కన్నుమూశారు. ఛాతీ నొప్పితో జూలై 20న హైదరాబాద్ అమీర్‌పేట(Hyderabad Ameerpet)లోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రి(Apollo Spectra Hospital)లో చేరిన ఆయన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆరోగ్యం కుదుటపడింది.. రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి అవుతారని భావిస్తుండగా.. అభిమానులను విషాదంలో ముంచెత్తుతూ లోకం వీడారు. గద్దర్‌కు గురువారం బైపాస్ సర్జరీ(Bypass surgery) చేశామని అపోలో స్పెక్ట్రా సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ దాసరి ప్రసాదరావు(Cardiologist Dr. Dasari Prasada Rao) తెలిపారు. గద్దర్ చాలాకాలంగా ఊపిరితిత్తులు, మూత్రాశయ సంబంధిత వ్యాధులతో ఇబ్బందిపడుతున్నారని పేర్కొన్నారు. ఆదివారం బీపీ పెరగడంతో పాటు షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోయాయని, పలు అవయవాలు విఫలమవడం, వయోభార సమస్యలతో మృతి చెందారని ప్రకటించారు.