ప్రారంభానికి సిద్ధమైన ఇల్లెందు డిపో
ABN , First Publish Date - 2023-01-10T23:17:33+05:30 IST
ఇల్లెందు ఏజన్సీ కుగ్రామాల ప్రజలకు ఆర్‌టీసీ బస్సుల రవాణా సౌకర్యాలు పూర్తిస్ధాయి లో త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

ఇల్లెందు, జనవరి 10: ఇల్లెందు ఏజన్సీ కుగ్రామాల ప్రజలకు ఆర్‌టీసీ బస్సుల రవాణా సౌకర్యాలు పూర్తిస్ధాయి లో త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు కొత్తగూడెం, ఖమ్మం, మహ-బాద్ ఆర్‌టీసీ డిపోల బస్సులు నడిచే రూట్లలోనే గిరిజన గ్రామాల ప్రజలకు బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉండగా ఇకపై ఇల్లెందు ప్రాంత ఏజెన్సీ కుగ్రామాల ప్రజలకు సైతం ఆర్‌టీసీ బస్సుల సౌకర్యం కలగనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హమీ ఇచ్చిన ఇల్లెందు ఆర్‌టీసీ బస్‌డిపో నిర్మాణ పనులు దాదాపు పూర్తయినాయి. తుది మెరుగులు దిద్దుకుంటుంది. ప్రారంభోత్సవానికి సిద్దమైన ఇ ల్లెందు డిపో మూలంగా ఇల్లెందు, గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి, గార్ల, బయ్యా రం, కారేపల్లి ఏజన్సీ మండలాల మా రుమూల గిరిజన గ్రామాల ప్రజలకు సైతం ఆర్‌టీసీ బ స్సుల రవాణా సౌకర్యాలు కలగనున్నాయి. మారుమూల ఏజెన్సీ గ్రామాలకు ఆర్‌టీసీ బస్సుల సౌకర్యం లేక ఆటో లు, ట్రాలీలు తదితర ప్రవేట్ వానాలనే ఆశ్రయిస్తు ఇల్లెం దు పట్టణానికి చేరుకొని వివిధ రాకపోకలు సాగిస్తున్నా రు. అనేక వ్యయప్రయసాలతో పెరిగిన రవాణా చార్జీలతో గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇల్లెందు నుంచి ఖమ్మం, ఇల్లెందు నుంచి కొత్తగూడెం, ఇల్లెందు నుంచి మహ-బాద్ పట్టణాల మధ్య రాత్రి 9గంటల తరువాత రాకపోకలు సాగించడాకి ఆర్‌టీసీ బస్సులు అందుబాటులో ఉండక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దుస్థి తి నెలకొంది. హైదరాబాద్‌కు సైతం రాత్రి 11గంటల వరకు మాత్రమే ఎక్స్‌ప్రెస్ బస్సు సౌకర్యాలు ఇల్లెందు నుంచి కేవలం రిజర్వేషన్‌లు చేసుకున్న ప్రజలకే అందుబాటులో ఉండటంతో ప్రయాణికులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ నేపధ్యంలో ఏజెన్సీ గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవని, ఇల్లెందు పట్టణంలో ఆర్‌టీసీ డిపో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే హరిప్రియ శాసనసభలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, పలుమార్లు రాష్ట్ర రవాణా శాఖ మం త్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు వివరించడంతో ఎట్టకేలకు గత ఏడాది ఇల్లెందులో ఆర్‌టీసీ శాటిలైట్ బస్‌డిపోను మంజూరు చేశారు. బస్‌డిపో నిర్మాణానికి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా మినరల్ ట్రస్టు ఫండ్(డీఎంఎఫ్) ద్వారా రూ.3కోట్లు నిధులు మంజూరు చేయడంతో బస్సు డిపో నిర్మాణ పనులు చేపట్టారు. ఆర్‌టీసీ బస్టాండ్ ప్రాం గణంలోనే రెండు ఎకరాల విస్తీర్ణంలో శాటిలైట్ డిపో పనులు పూర్తిచేశారు. నూతనంగా నిర్మించిన డిపోలో బస్సుల నిలుపుదలకు సువిశాలమైన గ్రౌండ్‌తో పాటు మహిళ సిబ్బంది వసతి సౌకర్యాలు, కార్యాలయం, మేటిరీయల్ స్టో ర్లకు సెక్యూరిటీలకు వేర్వేరు గదులు నిర్మించారు. సంక్రాం తి పర్వదినం నాటికి బస్‌డిపోను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్‌టీసీ వర్గాలు తెలిపాయి.