కాంగ్రెస్ మునిగే నావ
ABN , First Publish Date - 2023-01-10T23:53:26+05:30 IST
‘కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ.. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో సంగారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తున్నది’

సంగారెడ్డికి వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల తెచ్చిన ఘనత కేసీఆర్‌దే
త్వరలోనే సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు : రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు
మంత్రి సమక్షంలో తొగిర్‌పల్లి ఎంపీటీసీ, పలువురు బీఆర్‌ఎ్‌సలో చేరిక
సిద్దిపేట టౌన్, జనవరి 10: ‘కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ.. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో సంగారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తున్నది’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో, సంగారెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్ మండలం తొగిర్‌పల్లి గ్రామ కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఎంపీటీసీ గౌరీరెడ్డి సంతోష, సంతో్‌షరెడ్డి, లోక్‌సత్తా రాష్ట్ర కార్యదర్శి మాధవ్‌రెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్ మాణిక్యం, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు అశోక్‌తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో సంగారెడ్డికి ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలలు తెచ్చుకుని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నట్టు చెప్పారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన నడుస్తున్నాయని, త్వరలోనే సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్ మండలం, సంగారెడ్డిలకు గోదావరి జలాలు రానున్నాయన్నారు.
సంగారెడ్డిలో ఎగిరేది గులాబీ జెండానే
నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల గురించి సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్, నా వెంటపడి మరీ చింతా ప్రభాకర్ పనులు చేయించుకుంటున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డిలో గెలిచిన ఎమ్మెల్యే హైదరాబాద్‌లో ఉంటాడని, అయితే గెలిచినా, ఓడినా సంగారెడ్డి ప్రజల మధ్య ఉండే నాయకుడు చింతా ప్రభాకర్ అని మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10మంది ఎమ్మెల్యేలకు ఒక్క ఎమ్మెల్యేనే కాంగ్రెస్ పార్టీకి ఉందని, ఆ పార్టీలో ఉన్నవారికే సఖ్యత లేదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 ఎమ్మెల్యే సీట్లు గెలిచేది బీఆర్‌ఎ్‌స పార్టీయేనని వెల్లడించారు. సంగారెడ్డిలోని పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా నేను అండగా ఉంటానని మంత్రి హమీనిచ్చారు. సంగారెడ్డిలో ఎగిరేది గులాబీ జెండా అని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన వారిలో సురారం గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు గొల్ల నర్సింహులు, రోజా శ్రీనివాస్, ఇస్మాయిల్ బి, ఏర్పుల బందయ్య, నిజాంపూర్ గ్రామానికి చెందిన గూడల సత్యనారాయణ, కుమ్మరి నర్సింహులు, టీజేఆర్ మండల అధ్యక్షుడు బేగం రమేష్, యూత్‌అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, మైనార్టీ అధ్యక్షుడు కౌసర్ ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎంపీపీ మనోజ్‌రెడ్డి, జడ్పీటీసీ పద్మావతిపాండురంగం, పార్టీ మండల అధ్యక్షుడు మ్యాకం విఠల్, వైస్ ఎంపీపీ లక్ష్మీచంద్రయ్య, నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, మల్లాగౌడ్, మాధవ రెడ్డి, విఠల్‌రెడ్డి, కరుణాకర్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
నాడు మెచ్చుకున్నోళ్లే .. నేడు ఓర్వలేక తిట్లు
మద్దూరు, జనవరి 10: తెలంగాణలో కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను బీజేపీ నాయకులు నాడు ప్రశంసించి నేడు ఓర్వలేక తిడుతుండటాన్ని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.. మంగళవారం సిద్దిపేట జిల్లా దూళిమిట్ట మండల కేంద్రంలో రూ. 1.10 కోట్లతో పలు అభివృద్ధి పనులకు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్ర బెల్లిదయాకర్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచ్ దుబ్బుడు దీపికావేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలిచిన దూళిమిట్ట ప్రజలను గుండెల్లో పెట్టుకున్నామన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఒక్క దూళిమిట్టలోనే 534 ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద రూ.1.01కోట్ల నిధులు వచ్చాయన్నారు. నాడు తెలంగాణలో కేసీఆర్ సంక్షేమ పథకాల్ని మెచ్చుకుని అవార్డులు, రివార్డులు అందించినోళ్లు నేడు గల్లీలకొచ్చి తిడుతుండటాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కోరిక మేరకు చేర్యాలలో రూ. 11 కోట్లతో 610 పడకల ఆస్పత్రిని నిర్మించుకుంటున్నట్లు తెలిపారు. అంతకు ముందు గ్రామస్థులు డప్పుచప్పుళ్లతో ఘన స్వాగ తం పలికారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎడ్యుకేషన్ చైర్మన్ శ్రీధర్‌రెడ్డి, జడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డి, ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి, మార్కెట్‌కమిటీ చైర్మన్ మల్లేశం, సర్పంచులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.