Siddipet కలెక్టరేట్ వద్ద కుక్కల బీభత్సం
ABN , First Publish Date - 2023-04-04T13:21:02+05:30 IST
సిద్దిపేట: కలెక్టరేట్ (Collectorate) వద్ద కుక్కలు (Dogs) బీభత్సం (Panic) సృష్టిస్తున్నాయి. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి (Srinivasa Reddy)తోపాటు మరో ఇద్దరిపై కుక్కలు దాడి చేశాయి.
సిద్దిపేట: కలెక్టరేట్ (Collectorate) వద్ద కుక్కలు (Dogs) బీభత్సం (Panic) సృష్టిస్తున్నాయి. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి (Srinivasa Reddy)తోపాటు మరో ఇద్దరిపై కుక్కలు దాడి చేశాయి. కలెక్టర్ పెంపుడు కుక్క కూడా తీవ్రంగా గాయపడింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీనివాసరెడ్డి క్వార్టర్స్ (Quarters) ఆవరణలో వాకింగ్ (Walking) చేస్తుండగా ఆయనపై కుక్కలు దాడిచేశాయి. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే శ్రీనివాసరెడ్డిని ఆస్పత్రికి తరలించారు. అదే రోజు రాత్రి మరో వ్యక్తిని, కలెక్టర్ పెంపుడు కుక్కపై వీధి కుక్క దాడి చేసింది.
ఈ నెల 1వ తేదీ (శనివారం) సాయంత్రం అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తన ఇంటి వద్ద వాకింగ్ చేస్తుండగా.. వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరెడ్డిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సిద్దిపేటలో ఇటీవల కాలంలో వీధి కుక్కల సంచారం బాగా పెరిగిపోయింది. మొన్ననే ఓ అమ్మాయిని వీధి కుక్కలు దాడి చేసిన ఘటన మరువకమేందే ఈ ఘటన జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురౌతున్న పరిస్థితి కనిపిస్తోంది. వీధి కుక్కలను తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.