దుబ్బాకలోని కాలువలను త్వరలోనే పూర్తి చేయిస్తా
ABN , First Publish Date - 2023-02-05T23:11:47+05:30 IST
దుబ్బాక, పిబ్రవరి 5: దుబ్బాకలోని కాలువలను త్వరలోనే పూర్తి చేయిస్తానని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక, పిబ్రవరి 5: దుబ్బాకలోని కాలువలను త్వరలోనే పూర్తి చేయిస్తానని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం దుబ్బాక మండలం పెద్దచీకోడు గ్రామంలో కోటీ 20 లక్షలతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం గంభీర్‌పూర్, శిలాజీనగర్, బల్వాంతాపూర్ గ్రామాల్లోని పలు కార్యక్రమాల్లో పాల్గొని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై విమర్శలు గుప్పించారు. అబద్ధాల పునాదుల మీద గెలిచి.. అబద్ధాలతోనే కాలం గడుపుకునే అసమర్థజీవి రఘునందన్‌రావు అని అన్నారు. తన మీద పార్లమెంటుకు పోటీచేసి, డిపాజిట్ కూడా పొందలేని వ్యక్తి తనను విమర్శించడం చూస్తే, సిగ్గేస్తుందన్నారు. ఆయన వెంట జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత, ఏఎంసీ చైర్మన్ జ్యోతికృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ కైలాష్, రొట్టె రమేష్, జీడిపల్లి రవి, బాణాల శ్రీనివాస్ పాల్గొన్నారు.