R. Krishnaiah: కేసీఆర్‌పై ఎంపీ ఆర్.కృష్ణయ్య విమర్శలు
ABN , First Publish Date - 2023-06-01T21:50:19+05:30 IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (KCR) రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య (R. Krishnaiah) విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (KCR) రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య (R. Krishnaiah) విమర్శలు గుప్పించారు. కేసీఅర్ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా పని చేస్తోందని ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. 9 ఏళ్ల కాలంలో ఒక్క లోన్ ఇవ్వలేదని, ప్రతి బీసీకి రూ.లక్ష ఆర్థిక సహాయం ఇవ్వాలని, లేదంటే ప్రజాప్రతినిధులను గ్రామాల్లో తిరగనివ్వమని ఎంపీ మండిపడ్డారు. పెంచిన ఫీజుల జీవోను వెంటనే విడుదల చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. ప్రొఫెషనల్ కోర్సుల్లో బీసీలకు మొత్తం ఫీజు ప్రభుత్వమే చెల్లించాలని ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.