దేశానికే దిక్సూచి తెలంగాణ పోలీస్
ABN , First Publish Date - 2023-06-12T23:28:10+05:30 IST
తెలంగాణ పోలీస్ దేశానికే దిక్సూచి అని పలువురు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం పరిగిలోని కొడంగల్ చౌరస్తాలో 2కే రన్‌ను ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ప్రారంభించారు.

పరిగి, జూన్ 12: తెలంగాణ పోలీస్ దేశానికే దిక్సూచి అని పలువురు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం పరిగిలోని కొడంగల్ చౌరస్తాలో 2కే రన్‌ను ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం మినీ స్టేడియం మైదానంలో బెలూన్‌లు ప్రదర్శించి సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ పోలీసులు నేరాల నియంత్రణలో సఫలీకృతులవుతున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని టెక్నాలజీని తెలంగాణ పోలీస్ ఉపయోగించి, ఎంతటి నేరాలనైనా సులభరతంగా ఛేదిస్తున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో డీపీవో తరుణ్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ ఎం.అశోక్, ఎంపీపీ అరవింద్‌రావు, ఎంపీడీవో శేషగిరిశర్మ, మున్సిపల్ కమిషనర్ జి.శ్రీనివాసన్, సీఐ వెంకటరామయ్య, ఎస్‌ఐలు విఠల్‌రెడ్డి, శ్రీశైలం, గిరి పాల్గొన్నారు.
తాండూరు: తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా సోమవారం తాండూరు పట్టణంలో తెలంగాణ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని శాంత్‌మహాల్ చౌరస్తా, ఇందిరాచౌక్ మీదుగా విలియంమూన్ గ్రౌండ్ వరకు తెలంగాణ రన్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్, ఆర్డీవో అశోక్‌కుమార్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు అఫ్పు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్‌నాయక్, పట్టణ ప్రధాన కార్యదర్శి సంతో్‌షగౌడ్, పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి, రూరల్ సీఐ రాంబాబు, ఎస్‌ఐలు, మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కొడంగల్: తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా సోమవారం కొడంగల్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి బండెల ఎల్లమ్మ వరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. 2కే రన్‌ను కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ కృష్ణన్, మున్సిపల్ కమిషనర్ టి.ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐలు ఏ.రవిగౌడ్, శంకర్, రమేశ్‌కుమార్, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్‌యాదవ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
మూడుచింతలపల్లి: శామీర్‌పేట ఔటర్ రింగురోడ్డు వద్ద శామీర్‌పేట పోలీస్ ఇన్స్‌ఫెక్టర్ నిరంజన్‌రెడ్డి ఆఽధ్వర్యంలో 2కే రన్ పోటీలను ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. ఔటర్ సర్వీస్ రోడ్డులో ఇన్‌స్పెక్టర్ నిరంజన్‌రెడ్డి జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. డీసీఎంఎస్ వైస్‌చైర్మన్ మధుకర్‌రెడ్డి, మజీద్‌పూర్ సర్పంచ్ మోహన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ రన్‌లో పాల్గొన్నారు. విజేతలకు శామీర్‌పేట ఇన్‌స్పెక్టర్ నిరంజన్‌రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు.