Sleeping Issue: పని చేసేటప్పుడు నిద్ర వేధిస్తోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..
ABN , Publish Date - Mar 24 , 2025 | 08:58 AM
రాత్రివేళ వీలైనంత ఎక్కువ సేపు ఫోన్‌ను దరిచేరనివ్వకండి. అవసరమైతే తప్ప వాడకండి. రోజుకు 7 నుంచి 8 గంటల సేపు నిద్రపోయేందుకు ప్రయత్నించండి.

ఇంటర్నెట్ డెస్క్: ఆధునిక ప్రపంచంలో ఉద్యోగ, ఉపాధి రీత్యా పోటీ పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ ఉరుకుల పరుగుల జీవితం గడుపుతున్నారు. ఎప్పుడూ హడావిడిగా ఉంటూ శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిల్లో ముఖ్యంగా నిద్రలేమి ఒకటి. ఈ సమస్య కారణంగా ఇంట్లో నిద్రపోకుండా ఆఫీసుల్లో కునుకు తీస్తుంటారు. దీని కారణంగా ఉత్పాదకత తగ్గడమే కాకుండా నలుగురిలో నవ్వులపాలు అవుతుంటారు. అయితే ఆఫీసులో నిద్రపోకుండా ఏకాగ్రతగా పని చేసేందుకు కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో, నిత్య జీవితంలో వాటిని ఎలా అన్వయించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ సూత్రాలు పాటించండి..
రాత్రివేళ వీలైనంత ఎక్కువ సేపు ఫోన్‌ను దరిచేరనివ్వకండి. అవసరమైతే తప్ప వాడకండి. రోజుకు 7 నుంచి 8 గంటల సేపు నిద్రపోయేందుకు ప్రయత్నించండి. మంచి నిద్ర 40 శాతం మేర మెదడు చురుకుదనాన్ని పెంచుతుందని నేషనల్ స్లీప్ ఫౌండేషన్-2023 అధ్యయనం చెబుతోంది.
ప్రతి మనిషి రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీరు తాగడం ఎంతో ముఖ్యం. దీన్ని వల్ల శరీరంలో నీటి శాతం పెరిగి డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. మాయో క్లినిక్ ప్రకారం తగినంత నీరు మెదడు చురుకుదనాన్ని 25 శాతం మేర పెంచుతుంది.
ఆఫీసులో ఉన్నప్పుడు అదే పనిగా కూర్చిలో కూర్చొవద్దు. పని మధ్యలో గంటకోసారి 5 నుంచి 10 నిమిషాలపాటు బ్రేక్ తీసుకోవడం మంచిది. ఆ సమయంలో వాకింగ్ చేస్తే చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. దీన్ని వల్ల రక్త ప్రసరణ మెరుగుపడడమే కాకుండా నిద్ర రాకుండా ఉంటుంది.
కార్యాలయాలకు వెళ్లే వారు సమతుల ఆహారంపై దృష్టి పెట్టాలి. ఉదయం, మధ్యాహ్నం ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. రాత్రి వేళ మితంగా తినాలి. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ (2022) ప్రకారం లైట్ డైట్ నిద్రమత్తును 30 శాతం మేర తగ్గిస్తుంది.
కాఫీ, టీ అలవాటు ఉన్నవారు కప్పులుకప్పులు లాగించేస్తుంటారు. అలా అస్సలు చేయెుద్దు. రోజుకు 1 లేదా 2 కప్పుల కాఫీ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా తాగితే అందులోని కెఫిన్ రాత్రివేళ నిద్రను దెబ్బతీస్తుంది. దీంతో ఇంట్లో నిద్రపోకుండా ఆఫీసులో పడుకునే ప్రమాదం ఉంది. రోజుకు 400 మిల్లీ గ్రాముల కెఫిన్ సురక్షితమైన పరిమితిగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సూచిస్తోంది.
అలాగే పని చేసే సమయంలో అప్పుడప్పుడు 2 నుంచి 3 నిమిషాలపాటు లోతైన శ్వాస తీసుకోవాలి. కంప్యూటర్ స్క్రీన్ నుంచి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఈ చిట్కాలు పాటిస్తే ఆఫీసులో నిద్ర సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి:
Gold and Silver Prices: కొండెక్కిన పసిడి ధర.. ప్రస్తుతం రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold and Silver Prices: కొండెక్కిన పసిడి ధర.. ప్రస్తుతం రేట్లు ఎలా ఉన్నాయంటే..