Share News

Alcohol Drinking: మందుబాబుల కోసం స్పెషల్ టిప్స్

ABN , Publish Date - Mar 24 , 2025 | 09:33 AM

మద్యం అలవాటు కంట్రోల్ చేసుకోవాలని భావిస్తున్నారా.. అయితే మీ కోసం నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటిని ఫాలో అయితే మందు తాగే అలవాటును కంట్రోల్ చేసుకోవచ్చు.

Alcohol Drinking: మందుబాబుల కోసం స్పెషల్ టిప్స్
Alcohol Drinking

మద్యం అలవాటు ఆ మనిషిని మాత్రమే కాక కుటుంబాన్ని.. తద్వారా సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మద్యం వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయో లెక్కే లేదు. మోతాదుకు మించి మద్యం సేవిస్తే.. అది ఆరోగ్యాన్ని, జీవన ప్రమాణాలను దెబ్బ తీస్తుంది. మరి దీన్ని కంట్రోల్ చేయడం ఎలా అంటే.. నిపుణులు కొన్ని సూచనలు, చిట్కాలు అందిస్తున్నారు. వాటిని ఫాలో అయతే మద్యం అలవాటును కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ వివరాలు..


పరిమితి పెట్టుకొండి..

మద్యం అలవాటు కంట్రోల్ కావాలంటే.. అది తాగేందుకు మీకు మీరే పరిమితి పెట్టుకొండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. రోజుకు పురుషులు 2 డ్రింక్స్ (60 ఎమ్‌ఎల్ స్పిరిట్, 650 ఎమ్‌ఎల్ బీర్), మహిళలు 1 డ్రింక్‌కు మించకూడదని వెల్లడించింది. ఇలా పరిమితిగా మద్యం సేవిస్తే.. అది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుంది.

నీరు బాగా తాగండి

మద్యం సేవస్తున్నట్లయితే.. ప్రతి డ్రింక్ తర్వాత ఒక గ్లాస్ నీరు తాగడం అలవాటు చేసుకొండి. ఇలా చేయడం వల్ల డీహైడ్రేషన్‌ను నివారించవచ్చు, ఆల్కహాల్ తీసుకోవడాన్ని కూడా తగ్గించవచ్చు. మాయో క్లినిక్ ప్రకారం ఇలా నీరు తాగడం కాలేయ ఒత్తిడిని తగ్గిస్తుందని తెలిసింది.


ఆహారంతో తాగండి

ఖాళీ కడుపుతో మద్యం సేవిస్తే.. అది రక్తంలోకి వేగంగా శోషణం అవుతుంది. అందుకే ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఆహారం (గింజలు, గ్రిల్డ్ చికెన్) తీసుకుంటూ మద్యం సేవిస్తే.. అది శోషణ మందగింపజేస్తుందని.. జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ (2022) చెబుతోంది.

తాగని రోజులు పెట్టుకొండి

ప్రతి రోజు మద్యం సేవించకుండా.. వారంలో 2-3 రోజులు ఆల్కహాల్‌కు దూరంగా ఉండండి. ఇది శరీరాన్ని రికవరీ చేస్తుంది. అలానే మద్యం సేవించే అలవాటును తగ్గిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆన్ ఆల్కహాల్ అబ్యూస్ ఈ విధానాన్ని సూచిస్తుంది.


ప్రత్యామ్నాయాలు ఎంచుకోండి

మద్యం తాగడానికి బదులుగా దాని స్థానంలో మాక్‌టెయిల్స్, హెర్బల్ టీ, పళ్ల రసాలు వంటివి తాగడం అలవాటు చేసుకొండి. ఇలాంటి అలవాటు.. సామాజిక సందర్భాల్లో మీపై ఒత్తిడిని తగ్గిస్తుందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ (2023) వెల్లడించింది.

సలహా

మద్యం అలవాటు నియంత్రించుకోవాలంటే.. తాగే సమయాన్ని గమనించుకుంటూ ఉండాలి అంటున్నారు నిపుణులు. ఒక గంటలో ఒక డ్రింక్‌కు మించవద్దని చెబుతున్నారు. ఈ సమస్య ఇలానే కొనసాగితే వైద్య సహాయం తప్పక తీసుకోండి. పైన చెప్పిన చిట్కాలు మద్యం అలవాటను నియంత్రించడంతో పాటుగా మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.

ఇవి కూడా చదవండి:

ఈ చిట్కాలతో భార్య, భర్తల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి

వాకింగ్ తర్వాత ఈ పొరపాట్లు అసలు చేయకండి

Updated Date - Mar 24 , 2025 | 09:37 AM