Share News

Duplicate Driving License: డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఎలా

ABN , Publish Date - Mar 24 , 2025 | 08:46 AM

డ్రైవింగ్ లైసెన్స్ పోయిందా డూప్లికేట్ లైసెన్స్ ఎలా తెచ్చుకోవాలో ఈ కథనంలో విపులంగా తెలుసుకుందాము.

Duplicate Driving License: డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఎలా
Duplicate Driving License

ఇంటర్నెట్ డెస్క్: ఎంత జాగ్రత్తగా ఉన్నా అప్పుడప్పుడు ఊహించని సమస్యలు ఎదుర్కోక తప్పదు. ఆస్తి డాక్యుమెంట్స్, చదువు సర్టిఫికేట్స్, డ్రైవింగ్ లైనెస్స్ , ఆధార్ వంటి కీలక డాక్యుమెంట్స్ కూడా కొందరు పొగొట్టుకుంటూ ఉంటారు. ఇక డ్రైవింగ్ లైసెన్స్ పోతే మాత్రం చిక్కులు తప్పవు. సొంతం వాహనంపై అధికంగా ఆధారపడే వారికి ఇది మరింత ఇబ్బందికరం. ఇలాంటి సమయాల్లో డూప్లికేట్ లైసెన్స్ పొందడం సులభమే. మరి డూప్లికేట్ లైసెన్స్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం

పోలీస్ ఫిర్యాదు: లైసెన్స్ పోయిన వెంటనే ముందు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. ఆన్‌లైన్‌లో ఈ-ఎఫ్‌ఐఆర్ లేదా రాత ఫిర్యాదు ద్వారా ఎఫ్‌ఐఆర్ కాపీ లేదా నాన్-ట్రేసబుల్ సర్టిఫికెట్ (ఎన్‌టీసీ) తీసుకోవాలి. ఇది ఆధారంగా ఉపయోగపడుతుంది.


Also Read: బాబోయ్.. ఈ బుడ్డోడిని ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్నారా?

  • ఆ తరువాత డూప్లికేట్ లైసెన్స్ కోసం కొన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి

  • ఎఫ్‌ఐఆర్/ఎన్‌టీసీ కాపీ

  • ఫారం ఎల్ఎల్‌దీ (లాస్ట్ లైసెన్స్ డిక్లరేషన్)

  • ఆధార్, పాస్‌పోర్ట్ వంటి గుర్తింపు, చిరునామా ప్రూఫ్

  • పాత లైసెన్స్ నంబర్ లేదా కాపీ (ఉంటే)

  • రూ.200-300 ఫీజు

ఆర్‌టీఓ కార్యాయంలో నేరుగా ఫిర్యాదు చేయడం లేదా ఆన్‌లైన్ దరఖాస్తు: మీకు సమీపంలోని ఆర్‌టీఓకు వెళ్లి లేదా ‘పరివాహన్’ వెబ్‌సైట్ (parivahan.gov.in)లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్‌లో చేస్తే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి.


Also Read: ర్యాపిడో డ్రైవర్‌‌ను చూడగానే ఫుల్ ఖుష్.. ఊబెర్ క్యాబ్ క్యాన్సిల్ చేసిన మహిళ.. ఎందుకంటే..

ఈ లైసెన్స్ వివరాలను ఆర్‌టీఓ కార్యాలయం సరిచూసి, సమస్య లేకపోతే 15-30 రోజుల్లో డూప్లికేట్ లైసెన్స్ జారీ చేస్తుంది. కొన్ని చోట్ల ఈ లైసెన్స్‌ను ఆన్‌లైన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తప్పనిసరి జాగ్రత్తలు.. లైసెన్స్ నంబర్ కచ్చితంగా గుర్తుంచుకోవాలి. లైసెన్స్‌ ఫోటో కాపీ తీసిపెట్టుకోవాలి. లైసెన్స్ పోయినప్పుడు ఫిర్యాదు చేయడంలో ఆలస్యం కూడదు. ఫిర్యాదులో జాప్యం జరిగితే చివరకు కొత్త ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి, లైసెన్స్ పోయిన సందర్భాల్లో ఈ సూచనలు ఫాలో అయ్యి చాలా సులువుగా డూప్లికేట్ లైసెన్స్ పొందొచ్చు.

Read Latest and Viral News

Updated Date - Mar 24 , 2025 | 09:08 AM