Share News

MLA : జిల్లాకు సాగునీరు అందించడమే సీఎం లక్ష్యం

ABN , Publish Date - Dec 17 , 2024 | 12:19 AM

కరువు ప్రాంతమైన ఉమ్మడి అనంతపురం జిల్లాకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించి, సస్యశ్యామ లం చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తపన అని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు.

MLA : జిల్లాకు సాగునీరు అందించడమే సీఎం లక్ష్యం
Members of the Pamurai irrigation association offering a bouquet to the MLA

ఎమ్మెల్యే పరిటాల సునీత

అనంతపురం రూరల్‌/ రామగిరి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కరువు ప్రాంతమైన ఉమ్మడి అనంతపురం జిల్లాకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించి, సస్యశ్యామ లం చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తపన అని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మండ లంలోని పామురాయి చెరువు సాగునీటి వినియోగదా రుల సంఘం అధ్యక్షుడు రామ్మో హన, ఇతర సభ్యులు, మండల ముఖ్య నాయకులు వెంకటాపురంలోని క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యేని కలిశారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఎలాంటి వివాదాలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైనందున వారిని ఎమ్మెల్యే అభినందించారు. ఆయ కట్టు రైతుల విషయంలో బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

హంద్రీనీవా లైనింగ్‌ పనులు ఆపాలి: సీపీఐ

హంద్రీనీవా కాలువకు లైనింగ్‌ పనులు చేయాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే పరి టాల సునీతకు సీపీఐ నాయకులు విజ్ఞప్తి చేశారు. సీపీ ఐ జిల్లా సహాయకార్యదర్శి మల్లికార్జున, రాప్తాడు నియో జకవర్గం కార్యదర్శి రామకృష్ణ వెంక టాపురంలో వినతి పత్రం ఇచ్చారు. జిల్లాలో అనేక చెరువులకు నీరు అందడ మే కాకుండా దాదాపు 75వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు కాలువను వెడల్పు చేసి ఎక్కువ నీరు అందించాల్సి ఉం దన్నా రు. కానీ అలా కాకుండా కాలువ రెండో దశ అయిన జీడీపల్లి నుంచి లైనింగ్‌ పనులు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరైందని కాదన్నారు. దీనికి ఎమ్మెల్యే స్పం దిస్తూ జిల్లా రైతులకు మేలు చేసే విధంగానే ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని తెలిపారు. వీలైనంత ఎక్కువగా నీరు జిల్లాకు అందించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని పేర్కొన్నారు. మీరు చెప్పి న అన్ని అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి రమేష్‌, సహాయ కార్యదర్శి నరేష్‌ పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 17 , 2024 | 12:19 AM