Share News

Hyderabad: దేవుడా.. ఎంతపని చేశావయ్యా.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Apr 11 , 2025 | 11:04 AM

కారు ఢీ కొని బీఫార్మసీ విద్యార్థిని దుర్మరణం చెందిన విషాద సంఘటన ఇది. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓఆర్‌ఆర్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొప్పు స్పందన అనే బీఫార్మసీ విద్యార్థిని తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే కన్నుమూసింది.

Hyderabad: దేవుడా.. ఎంతపని చేశావయ్యా.. ఏం జరిగిందంటే..

- కారు ఢీ కొని బీఫార్మసీ విద్యార్థిని దుర్మరణం


హైదరాబాద్: బైక్‌ను కారు ఢీ కొట్టిన ఘటనలో బీఫార్మసీ విద్యార్థిని(B.Pharmacy student) అక్కడికక్కడే దుర్మరణం చెందింది. బైక్‌ నడుపుతున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓఆర్‌ఆర్‌ సమీపంలో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri ) జిల్లా నారాయణపురం మండలం చిల్లాపూర్‌ గ్రామానికి చెందిన కొప్పు శంకరయ్య కుటుంబంతో కలిసి సైదాబాద్‌లోని సింగరేణి కాలనీ(Singareni Colony)లో నివాసం ఉంటున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మద్యం ప్రియులకో బ్యాడ్ న్యూస్.. రేపు దుకాణాలు బంద్‌


city2.3.jpg

అతడి కుమార్తె కొప్పు స్పందన (19) ఘట్‌కేసర్‌ ప్రాంతంలోని ఓ ప్రైవేట్‌ హాస్టల్లో ఉంటూ బీఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతోంది. కాగా, స్పందన తెలిసిన వ్యక్తి సాయికుమార్‌ బైక్‌పై గురువారం కొహెడ సర్వీసు రోడ్డులో వెళ్లారు. అదే సమయంలో ఓ కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ బైకును ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైక్‌పై నుంచి ఎగిరి కింద పడిన స్పందన అక్కడికక్కడే మృతి చెందింది. సాయికుమార్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Adilabad: కన్నీటి కష్టాలు

గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గించాలి

పేదలకు మూడు రంగుల కార్డులు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 11 , 2025 | 11:04 AM