-
-
Home » Mukhyaamshalu » Todays Breaking News 11th April 2025 Friday Live Updates on Top Stories Latest Headlines Politics, Sports, Business and Real-Time Updates in Telugu Siva
-

Breaking News: రెచ్చిపోయిన గోరంట్ల మాధవ్, వైసీపీ నేతలు..
ABN , First Publish Date - Apr 11 , 2025 | 10:54 AM
Todays Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-04-11T18:00:46+05:30
రెచ్చిపోయిన గోరంట్ల మాధవ్, వైసీపీ నేతలు..
గుంటూరు పోలీసులతో గోరంట్ల మాధవ్ వాగ్వాదం
ఎంపీగా పనిచేసిన వ్యక్తిని ఎలా మీడియా సమావేశంలో ప్రవేశపెడతారంటూ గోరంట్ల మాధవ్ వాదన
మీడియా సమావేశంలో ప్రవేశపెట్టకుండానే గోరంట్ల మాధవ్‌ను కోర్టుకు తరలించిన పోలీసులు
గుంటూరు జిల్లా కోర్టుకు గోరంట్ల మాధవ్ తరలింపు
కోర్టు దగ్గరకు వచ్చిన వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, అప్పిరెడ్డి, మేరుగు నాగార్జున
కోర్టు దగ్గర పోలీసులతో వాగ్వాదానికి దిగిన గోరంట్ల మాధవ్, వైసీపీ నేతలు
-
2025-04-11T17:58:13+05:30
గోరంట్ల మాధవ్‌పై నాన్‌బెయిలబుల్ కేసు..
గోరంట్ల మాధవ్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు: ఎస్పీ సతీష్
పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు కిరణ్‌పై గుంటూరు ఎస్పీ ఆఫీస్ వద్ద గోరంట్ల మాధవ్ దాడి చేశారు: ఎస్పీ సతీష్
పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన గోరంట్ల మాధవ్: ఎస్పీ సతీష్
పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం నేరపూరిత చర్య: ఎస్పీ సతీష్
గుంటూరు చుట్టగుంట దగ్గర పోలీసు వాహనాన్ని అనుచరులతో అడ్డుకున్న గోరంట్ల మాధవ్: ఎస్పీ సతీష్
గోరంట్ల మాధవ్‌తోపాటు ఆరుగురు అరెస్ట్: గుంటూరు ఎస్పీ
-
2025-04-11T17:54:59+05:30
పొత్తు ఖరారు..
తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే పొత్తు ఖరారు
2026 ఎన్నికల్లో కలిసి పోటీచేయనున్న బీజేపీ, అన్నాడీఎంకే
NDA కూటమిలో చేరిన అన్నాడీఎంకే
రెండు పార్టీల పొత్తుపై అమిత్‌షా ప్రకటన
సీఎం అభ్యర్థిగా పళనిస్వామిని ప్రకటించిన అమిత్‌షా
ఎలాంటి షరతులు లేకుండానే పొత్తు: అమిత్‌షా
పళనిస్వామి నేతృత్వంలో తమిళనాడులో పోటీ: అమిత్‌షా
-
2025-04-11T17:31:22+05:30
కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సవాల్
గత పదేళ్లలో భూ దోపిడీపై చర్చకు సిద్ధమా?: మహేష్ గౌడ్
దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలి: మహేష్ గౌడ్
కరెప్షన్‌కు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ కుటుంబం: మహేష్ గౌడ్
లిక్కర్ స్కాం చేసింది కేసీఆర్ కుటుంబమే: మహేష్ గౌడ్
కేటీఆర్ మరీ ఇంత దిగజారుతారా?: మహేష్ గౌడ్
బిల్లీరావుతో కేటీఆర్ ఒప్పందం చేసుకున్నారు: మహేష్‌గౌడ్
అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ దోపిడీ చేసింది కేసీఆర్ కుటుంబం: మహేష్ గౌడ్
కేసీఆర్ కుటుంబంపై సీబీఐ విచారణ జరపాలి: మహేష్ గౌడ్
BRS భూ దోపిడీపై విచారణ జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా..
ఏదో ఒకరోజు కేటీఆర్ అరెస్టు తప్పదు: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
ఫార్ములా-E రేసు కేసులో కేటీఆర్ అరెస్టు అవుతారు: మహేష్ గౌడ్
-
2025-04-11T15:44:04+05:30
సైనేడ్ తాగి ఆత్మహత్య..
అనంతపురం: తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎదుట బంగారం వ్యాపారి ఆత్మహత్య
బర్కత్ జ్యువెలరీ యజమాని చిన్న గౌసుల్లా పోలీస్ స్టేషన్ ఎదుట సైనేడ్ తాగి ఆత్మహత్య
అప్పుల వారి వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు ఆవేదన
-
2025-04-11T11:02:22+05:30
తహవూర్ రాణాకు 18 రోజుల కస్టడీ
ఢిల్లీ: NIA కస్టడీలో 26/11 పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణా
నిన్న రాణాను కోర్టులో హాజరుపరిచిన NIA అధికారులు
తహవూర్ రాణాకు 18 రోజుల కస్టడీ విధించిన NIA స్పెషల్ కోర్ట్
స్పెషల్ సెల్‌లో రాణాను విచారించనున్న NIA అధికారులు
-
2025-04-11T10:58:32+05:30
జగన్ హయాంలో భారీ కుంభకోణం
నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జగన్ ప్రభుత్వ హయాంలో భారీ క్వార్ట్జ్ కుంభకోణం.
రూ.10వేల కోట్లకి పైగా స్వాహా చేశారనే ఆరోపణలు.
సీబీఐ, ఈడీ, లోకాయుక్తకి ఫిర్యాదులు చేసిన మైన్ యజమాని ఆదూరు బద్రీనాథ్.
ప్రభుత్వ, అటవీ, దేవాదాయ శాఖ భూముల్లో అక్రమ తవ్వకాలు, భారీ బ్లాస్టింగ్స్, విదేశాలకి ఎగుమతులు, రూ.వేల కోట్ల నగదు లావాదేవీలు, ఫోన్ కాల్స్‌పై సీబీఐ, ఈడీ అధికారులు ఆరా.
రెండు రోజులు కిందట నేరుగా విచారణ జరిపిన లోకాయుక్త బృందం.
క్వార్ట్జ్ కుంభకోణంలో వైసీపీ పెద్దలు, మాజీ మంత్రులు, ముఖ్య నేతలు.
సీబీఐ, ఈడీ, లోకాయుక్త ఎంట్రీతో అక్రమార్కుల గుండెల్లో గుబులు.
ఇప్పటికే సీఐడీ విచారణకి ఏపీ ప్రభుత్వం ఆదేశం.
మైన్స్ యజమానుల ఫిర్యాదుల మేరకు ముమ్మరంగా విచారిస్తున్న సీఐడీ.
పలు కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం.
-
2025-04-11T10:55:37+05:30
భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు
1200 పాయింట్లకుపైగా లాభంలో సెన్సెక్స్
400 పాయింట్లకుపైగా లాభంలో నిఫ్టీ
-
2025-04-11T10:54:02+05:30
గోరంట్ల మాధవ్‌కు బిగ్ షాక్..
గుంటూరు: మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు.
నిన్న తాడేపల్లిలో మంత్రి నారా లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాధవ్.
గోరంట్ల మాధవ్‌పై తాడేపల్లి స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన టిడిపి నేతలు.