TRANSFORMER : పేలిన ట్రాన్సఫార్మర్
ABN , Publish Date - Apr 29 , 2024 | 12:37 AM
: పట్టణంలోని 220 కేవీ సబ్‌స్టేషనలో ఆదివారం రాత్రి పొటెన్షియల్ ట్రాన్సఫార్మర్ పేలి భారీగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది వెంటనే విద్యుత సరఫరాను నిలపివేసి మంటలను అదుపులోకి తెచ్చారు. ట్రాన్సఫార్మర్ పేలడంతో గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ, కర్నూలు జిల్లా పత్తికొండ...
గుత్తి, ఏప్రిల్ 28: పట్టణంలోని 220 కేవీ సబ్‌స్టేషనలో ఆదివారం రాత్రి పొటెన్షియల్ ట్రాన్సఫార్మర్ పేలి భారీగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది వెంటనే విద్యుత సరఫరాను నిలపివేసి మంటలను అదుపులోకి తెచ్చారు. ట్రాన్సఫార్మర్ పేలడంతో గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ, కర్నూలు జిల్లా పత్తికొండ, ఆదోని తదితర ప్రాంతాల్లో దాదాపు
మూడు గంటల పాటు విద్యుత సరఫరా నిలచిపోయింది. దీంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులు అల్లాడిపోయారు. అధికారులు యుద్ధప్రాతిపదికన విద్యుత పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. రాత్రి పది గంటల సమయంలో విద్యుత సరఫరాను పునరుద్ధరించడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....