PENSIONS DISTRIBUTION: అర్హులందరికీ పింఛన్లు అందిస్తాం
ABN , Publish Date - Aug 31 , 2024 | 11:36 PM
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మండలం నరసంపల్లి, సోమరవాండ్లపల్లి గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా పిం ఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
కనగానపల్లి, ఆగస్టు 31: అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మండలం నరసంపల్లి, సోమరవాండ్లపల్లి గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా పిం ఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. శనివారం తెల్లవారుజామున నుంచే గ్రామాలలో అధికారులు, ప్రజాప్రతినిధులు పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. అధికారులు, గ్రామస్థులతో కలిసి ఇంటింటికి వెళ్లి పింఛన సొమ్మును ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. ముందుగా పింఛనదారుల కుటుంబసభ్యుల పరిస్థితులను తెలుసుకుని నెలనెలా ఇంటివద్దనే పింఛన్లు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట ఇచ్చారంటే ఎన్ని ఇబ్బందులున్నా నెరవేర్చుతారన్నారు. సర్పంచ సోమరచంద్రశేఖర్, కన్వీనర్ యాతం పోతలయ్య, పూజారి రాజాకృష్ణ, ఎంపీడీఓ అనిల్‌కుమార్, నాయకులు ఆదెప్ప, చంద్ర, బిల్లే దాము లక్ష్మణ్ పాల్గొన్నారు.
గార్లదిన్నె: పింఛనదారుల సంతోషమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యమని శింగనమల నియోజకవర్గ టూమెన కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని తెలుగుతమ్ముళ్లు, అధికారులతో కలసి శనివారం ప్రారంభించారు. మండల వ్యాప్తంగా 7784 మందికి గాను 7480 పంపిణీ చేశారు. 96.22 శాతం పంపిణీ చేసినట్లు ఎంపీడీఓ విజయ్‌బాస్కర్ తెలిపారు. టీడీపీ బీసీసెల్ జిల్లా అధ్యక్షులు ఆవులక్రిష్ణయ్య, గోరకాటి వెంకటేసు, జయరాం, సుబ్బయ్య, చల్లానాగరాజు, చితంబరప్ప పాల్గొన్నారు.
పించనతో పేదలకు భరోసా
బుక్కరాయసముద్రం: ఎన్టీఆర్ భరోసా పింఛనతో పేదల జీవనానికి భరోసాగా నిలుస్తోందని ద్విసభ్యకమిటీ సభ్యుడు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి అన్నారు. శనివారం పింఛన పండుగ కార్యక్రమంలో భాగంగా బుక్కరాయసముద్రం గ్రామ పంచాయతీ గౌరయ్య సేను కొట్టాలలో వారితో పాటు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి హాజరై పింఛన్లు పంపిణీ చేశారు. మాజీ ఎంపీపీ ఎస్‌కే వెంకటేశులు, మండల కన్వీనర్ అశోక్, నారాయణస్వామి, లక్ష్మీనారాయణ, కేశన్న, నారాయణస్వామి, అక్కులప్ప, శివ పాల్గొన్నారు. అలాగే సిద్దరాంపురం గ్రామంలో జిల్లా టీడీపీ ఉపాధ్యాక్షులు పసుపుల హనుమంతురెడ్డి, ఉపసర్పంచ నారాయణస్వామి అధ్వర్యంలో లబ్ధిదారుల ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేశారు.
రాప్తాడు: పింఛనదారులందరికీ ఒక రోజు ముందే పింఛన్లు అందించిన ఘనత సీఎం చంద్రబాబుదే అని మండల కన్వీనర్ కొండప్ప తెలిపారు. శనివారం ఉదయం గ్రామ సచివాలయ సిబ్బందితో కలిసి రాప్తాడులో పింఛన్లు పంపిణీ చేశారు. రాప్తాడు సర్పంచ సాకే తిరుపాలు, తహసీల్దార్ విజయకుమారి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
అనంతపురంరూరల్: పింఛనదారులకు ఒక్కరోజు ముందుగానే సీఎం చంద్రబాబు తీసుకొచ్చారని మండల ప్రధాన కార్యదర్శి పామురాయి రఘు అన్నారు. మండలంలోని పామురాయి గ్రామంలో శనివారం పింఛన పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం 6గంటలకే సచివాలయ ఉద్యోగులతో కలసి టీడీపీనాయకులు పింఛన్లు పంపిణీ చేశారు. మండల ప్రధాన కార్యదర్శి పాల్గొని పింఛన పంపిణీ చేశారు. గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాసులు, రాము, విశ్వనాథ్, సాయినాథ్, రామాంజనేయులు పాల్గొన్నారు. అలాగే ఎ.నారాయణపురం పంచాయతీ తపోవనంలో టీడీపీ నాయకులు ఇంటింటికి పింఛన పంపిణీ చేశారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు డిష్‌నాగరాజు, మాజీ ఉపసర్పంచు ఓబుళపతి, రఘునాథ రాయల్ ఇంటింటికి తిరుగుతూ.. పింఛన పంపిణీ చేశారు.
ధర్మవరంరూరల్(కనగానపల్లి): కనగానపల్లి మండలవ్యాప్తంగా 91శాతం పింఛన్లు పంపిణీ పూర్తిచేసినట్లు ఎంపీడీఓ అనిల్‌కుమార్ తెలిపారు. మండలవ్యాప్తంగా 18 పంచాయతీల్లో శనివారం పంపిణీ చేశామని, మిగిలినవి సోమవారం అందిస్తామన్నారు. టీడీపీ మండల కన్వీనర్ యాతం పోతలయ్య, పూజారి రాజాకృష్ణ, కుళ్లాయప్ప, ఆంజనేయులు, యువరాజ్, ఉమాపతి పాల్గొన్నారు.
శింగనమల: మండలంలో సామాజిక పింఛన్లను అధికారులు, టీడీపీ నాయకులు వర్షంలోనే ఇంటింటికీ వెళ్లి పింఛనదారులకు అందజేశారు. శనివారం ఉదయం 5.30 గంటలకే గ్రామాల్లో పింఛన్లు పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా 99 శాతం పంపిణీ చేశారు. మండల సెష్పల్ ఆఫీసర్ చంద్రశేఖర్, తహసీల్దార్ బ్రహ్మయ్య, ఈఓపీఆర్‌డీ మురళీకృష్ణ, సర్పంచ డేగల లలితమ్మ పాల్గొన్నారు.