Share News

MLA : గ్రామాల్లో అభివృద్ధిపై ప్రజల్లో హర్షం

ABN , Publish Date - Dec 10 , 2024 | 12:23 AM

గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోం దని, ఆర్నెల్లలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్క్‌ కనిపిస్తోందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొ న్నారు. ఆమె సోమవారం మండలపరిధిలోని కుంటిమద్ది గ్రామంలో రూ. 36.50 లక్షల వ్యయంతో ఎనఆర్‌జీఎస్‌ నిధులతో నిర్మించిన సీసీరోడ్లను స్థానిక టీడీపీ నాయకు లు, అధికారులతో కలిసి పరిశీలించారు.

MLA : గ్రామాల్లో అభివృద్ధిపై ప్రజల్లో హర్షం
MLA Paritalasunita showing the roads

రామగిరి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోం దని, ఆర్నెల్లలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్క్‌ కనిపిస్తోందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొ న్నారు. ఆమె సోమవారం మండలపరిధిలోని కుంటిమద్ది గ్రామంలో రూ. 36.50 లక్షల వ్యయంతో ఎనఆర్‌జీఎస్‌ నిధులతో నిర్మించిన సీసీరోడ్లను స్థానిక టీడీపీ నాయకు లు, అధికారులతో కలిసి పరిశీలించారు. గ్రామంలో రోడ్ల సమస్యలు పరిష్కరించి నందుకు గ్రామస్థులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీప డేది లేదని, మీకు ఎక్కడైనా నాణ్యతలేదని అనిపిస్తే అక్కడే ప్రశ్నించవచ్చని ఆమె ప్రజలకు సూచించారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ మండల ప్రధానకార్యదర్శి మారుతీప్రసాద్‌, తెలుగుయువత మండల అధ్యక్షుడు శ్రీధర్‌నాయుడు, మాజీ సర్పంచ నల్లప్ప, ఆనంద్‌, రఘురాం తదితరులు ఉన్నారు.


దుష్ప్రచారాన్ని యాప్‌ ద్వారా తిప్పికొట్టండి

అనంతపురం అర్బన, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : ప్ర భుత్వంపై దుష్ప్రచారాన్ని టీడీపీ యాప్‌ ద్వారా తిప్పి కొట్టాలని ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. మన టీడీపీ యాప్‌లో పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పతకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వారిలో 14 మంది క్రీ యాశీలక సభ్యులకు పార్టీ అధిష్టానం ప్రశం సా పత్రాలు పంపింది. వాటిని సోమవారం నగరంలోని క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే వారికి అందించి, అభినందించారు. కూటమి ప్రభుత్వంపై విషప్రచారాలను దృష్టిలో ఉంచు కొని ప్రతి ఒక్కరూ వాస్తవాలను ప్రజల్లోకి ఎప్పటికప్పుడు తీసుకువెళ్లాలన్నారు.

పంట కోత యంత్రాల పంపిణీ

రాప్తాడు నియోజకవర్గానికి చెందిన పలువురు రైతులకు పంట కోత యంత్రాలను ఎమ్మెల్యే పరిటాల సునీత పంపిణీ చేశారు. సోమవారం స్థానిక తన క్యాంపు కార్యాలయం వద్ద ఆరుగురు రైతులకు పంట కోత యం త్రాల మంజూరు పత్రాలను అందజేశారు. వారు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలియజేశారు. .పంట కోత యంత్రం పూర్తి ధర రూ.5.70 లక్షలు కాగా ఇందులో ప్రభుత్వం రూ.2 లక్షలు సబ్సిడీ వర్తింపజేసిందని తెలిపారు. అనంతపురం ఏడీఏ రవి, ఏఓ శశికళ, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 10 , 2024 | 12:23 AM