ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YS Sharmila: మీరు ముమ్మాటికీ నియంతలే.. వైసీపీపై షర్మిల ఫైర్

ABN, Publish Date - Feb 22 , 2024 | 09:15 AM

Andhrapradesh: నిరుద్యోగుల సమస్యలపై ఈరోజు ఛలో సెక్రటేరియట్‌కు కాంగ్రెస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే గత రాత్రి నుంచి ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆంధ్రరత్న భవన్‌లోనే ఉండిపోయారు. అరెస్టు ఈరోజు ఉదయం 10 గంటలకు ఆంధ్రరత్న భవన్‌ నుంచి షర్మిల ఛలో సెక్రటేరియట్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. అయితే పార్టీ కార్యాలయం నుంచి బయటకి వచ్చిన గిడుగు రుద్రరాజు, మస్తాన్ వలీలను పోలీసులు అరెస్ట్ చేశారు.

విజయవాడ, ఫిబ్రవరి 22: నిరుద్యోగుల సమస్యలపై ఈరోజు ఛలో సెక్రటేరియట్‌కు కాంగ్రెస్ (Congress) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే గత రాత్రి నుంచి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (APCC Chief YS Sharmila) ఆంధ్రరత్న భవన్‌లోనే ఉండిపోయారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ఆంధ్రరత్న భవన్‌ నుంచి షర్మిల ఛలో సెక్రటేరియట్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. అయితే పార్టీ కార్యాలయం నుంచి బయటకి వచ్చిన సీడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju), వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలిలను (Mastan Vali) పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ నియంత పాలనలో మెగా డీఎస్సీనీ (DSC) దగా డీఎస్సీ చేశారని నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. తమ చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టారని... ఇనుప కంచెలు వేసి బందీలు చేశారన్నారు. నిరుద్యోగుల పక్షాన నిలబడితే అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహించారు. ‘‘మమ్మల్ని ఆపాలని చూసే మీరు ముమ్మాటికీ నియంతలే. ఇందుకు మీ చర్యలే నిదర్శనం’’ అని ఘాటుగా విమర్శించారు. గిడుగు రుద్రరాజు, మస్తాన్ వలిని వెంటనే విడుదల చేయాలన్నారు. 23 వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి 6 వేలకే నోటిఫికేషన్ ఇచ్చినందుకు వైసీపీ సర్కార్ నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 22 , 2024 | 09:29 AM

Advertising
Advertising