Share News

Bejawada : ఆపన్నుల కోసం... పరిమళించిన మానవత్వం

ABN , Publish Date - Sep 07 , 2024 | 04:16 AM

బెజవాడ దుఃఖదాయిని బుడమేరు విధ్వంసంతో తీవ్రంగా నష్టపోయి, విలవిలలాడుతున్న ప్రజల సహాయార్థం రాష్ట్రం నలుమూలల నుంచి దాతలు స్పందిస్తున్నారు.

Bejawada : ఆపన్నుల కోసం... పరిమళించిన మానవత్వం

  • విరాళాన్ని ప్రకటించిన ‘విద్యుత్తు’ ఇంజనీర్లు, సిబ్బంది

  • 12 కోట్లు ప్రకటించిన పోలీసులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

బెజవాడ దుఃఖదాయిని బుడమేరు విధ్వంసంతో తీవ్రంగా నష్టపోయి, విలవిలలాడుతున్న ప్రజల సహాయార్థం రాష్ట్రం నలుమూలల నుంచి దాతలు స్పందిస్తున్నారు. మేము సైతం అంటూ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు. విజయవాడ కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబును... కలసి విరాళాలను చెక్కు, నగదు రూపంలో అందించారు. ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని ఏపీఎ్‌సఈబీ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ తీర్మానించింది. శుక్రవారం అసోసియేషన్‌ సెక్రటరీ జనరల్‌ కె.నాగప్రసాద్‌ ఈమేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలుగునాడు విద్యుత్‌ సంఘం కూడా ఒక రోజు మూల వేతనాన్ని ఇస్తామంటూ ముందుకు వచ్చింది. విద్యుత్తు సంస్థల తరఫున ఉద్యోగుల ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని, ఆమేరకు సీఎంఆర్‌ఎ్‌ఫకు నిధులను జమ చేయడానికి జెన్కో ఎండీ, డిస్కమ్‌ల సీఎండీలు చర్యలు తీసుకోవాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ట్రాన్స్‌ కో చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.విజయానంద్‌ ఆదేశించారు.

Untitled-13 copy.jpg


  • ఖాకీల విరాళం 12 కోట్లు

సీఎం చంద్రబాబు స్ఫూర్తితో వరద బాధితుల సహాయక కార్యక్రమాల్లో పోలీసులు పాల్గొంటున్నారని ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జనకుల శ్రీనివాసరావు, ఎండీ.మస్తాన్‌ఖాన్‌, ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు ఎం.సోమయ్య తెలిపారు. తమ ఒక రోజు మూలవేతనం రూ.12కోట్లును డీజీపీ ద్వారా సీఎంఆర్‌ఎఫ్‌ అందజేసినట్లు తెలిపారు.

  • కాటూరి.. రూ.10 కోట్లు, జాస్తి 5 కోట్లు

కాటూరి సుబ్బారావు రూ.10 కోట్లు, జాస్తి సుధ-వెంకట్‌ ఫ్యామిలీ రూ.5 కోట్లు, శ్రీచైతన్య, కాకినాడ సీపోర్ట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ కేవీరావు రూ.5 కోట్లు, ఏఎం గ్రీన్‌ కో సంస్థ రూ.5 కోట్లు, శ్రీకళ్యాణ చక్రవర్తి మెమోరియల్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ రూ.2 కోట్లు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు రూ.1 కోటి, రవికుమార్‌రెడ్డి, సుజలాన్‌, యాక్సిస్‌ ఎనర్జీ తరఫున బపేశ్వరరావు రూ.1 కోటి, సీఎం రాజేశ్‌, సీఎం రిత్విక్‌ రూ.1 కోటి, ఆర్వీఆర్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.51 లక్షలు, మోహిత్‌ మినరల్స్‌ సంస్థ రూ.51 లక్షలు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు రూ.50 లక్షలు, విజయవాడ క్లబ్‌ తరఫున సెక్రటరీ పీ చంద్రశేఖరరావు, శైలేజ్‌, రాజా రూ.50 లక్షలు, కళ్యాణ్‌ ఆక్వా అండ్‌ మెరైన్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఇండియా లిమిటెడ్‌ అధినేత ఓపర్తి రాజేంద్రబాబు రూ.10 లక్షలు, కోటపాటి జనార్ధన్‌రావు రూ.10 లక్షలు, పీఐవీవోఎక్స్‌ ల్యాబ్స్‌ రూ.7,03,999, నెల్లూరు టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి రూ.5 లక్షలు, కోటంరెడ్డి సంధ్య రూ.5 లక్షలు, సిశ్వాన్‌ ఇన్‌ఫ్రా రూ.5 లక్షలు, మధూర్‌ భార్గవ్‌ నాయుడు రూ.5 లక్షలు, ఆల్ఫా ఎడ్యుకేషన్‌ సొసైటీ రూ.5 లక్షలు, భార్గవ్‌రామ్‌ నాయుడు రూ.5 లక్షలు, కమలకుమారి రూ.5 లక్షలు సీఎం చంద్రబాబుకు అందజేశారు.


  • ఎస్‌బీఐ సాయం 5.87 కోట్లు

ఎస్‌బీఐ 5.87కోట్ల సాయం ప్రకటించింది. చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ రాజేశ్‌ కుమార్‌ పటేల్‌, జిఎం శైలేష్‌ కుమార్‌ ఈ మొత్తం సీఎంకు అందించారు.

  • ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలూ...

ఏపీ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల సంఘం కోటిన్నర విరాళాన్ని ప్రభుత్వానికి అందజేసింది. ఆ సంఘం నేతలు వాసిరెడ్డి విద్యాసాగర్‌, పెద్దిరెడ్డి మధుసూదన్‌రావు, గ్రంథి సత్యనారాయణ, కోయె సుబ్బారావు, ఆర్‌.వెంకట్రావు తదితరులు లోకేశ్‌కు చెక్‌ అందజేశారు.

  • పంచాయతీరాజ్‌ చాంబర్‌ 7.70 కోట్లు

ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ తరుఫున రూ.7.70కోట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చాంబర్‌ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

Updated Date - Sep 07 , 2024 | 04:16 AM