Chandrababu: జగన్ నీ ఎన్నికల గుర్తుగా గొడ్డలిని పెట్టుకో.. చంద్రబాబు విసుర్లు
ABN, Publish Date - Apr 05 , 2024 | 07:27 PM
సీఎం జగన్ (CM Jagan) తన ఎన్నికల గుర్తుగా గొడ్డలిని పెట్టుకోవాలని తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. శుక్రవారం నాడు నరసాపురంలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొని సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
పశ్చిమగోదావరి: సీఎం జగన్ (CM Jagan) తన ఎన్నికల గుర్తుగా గొడ్డలిని పెట్టుకోవాలని తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. శుక్రవారం నాడు నరసాపురంలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొని సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ఏమైనా సాధించారా అని ప్రశ్నించారు. యువకుల జీవితాలను అంధకారం చేశారని మండిపడ్డారు. ఆయన పాలనలో అన్ని వర్గాలు నాశనం అయ్యాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
Kutami: 7 స్థానాల్లో అభ్యర్థులు గెలిచి మోదీ, బాబు, పవన్‌లకు కానుకగా ఇస్తాం: కేశినేని చిన్ని
జగన్ రివర్స్ పాలనలో రాష్ట్రం రివర్స్ అయ్యిందని ధ్వజమెత్తారు. ఏ ప్రభుత్వం అయినా ఆదాయం పెంచి ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలన్నారు. గోదావరి అనగానే గుర్తుకొచ్చేది దేశానికి అన్నం పెట్టే అన్నదాత అని చెప్పారు. అటువంటి అన్నదాత ఈ రోజు ఇబ్భందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్వా రంగాన్ని జగన్ సంక్షోభంలో పెట్టారని.. కరెంటు ఛార్జీలు పెంచారని విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అక్వా రంగానికి పూర్వవైభవం తీసుకువస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Nara Bhuvaneshwari: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబుపై రుద్దుతున్నారు
అక్వాకి యూనిట్‌కు రూ.1.50లకే కరెంట్ ఇస్తామన్నారు. అన్నదాతను ఆదుకుంటామని.. రైతును రాజును చేస్తామని చెప్పారు. రైతు నష్టపోతే ఆ దేశం బాగుపడదన్నారు. రాజకీయం అంటే వ్యాపారం కాదని సేవాభావం అన్న వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని చెప్పారు. వైసీపీ విముక్త రాష్ట్రంగా చేయాలనే నినాదంతో పవన్ ముందుకు వచ్చారని తెలిపారు. వైసీపీ ఫ్యాన్ అరిగిపోయిందని తిరిగే పరిస్థితి లేదని.. తిరగని ఫ్యాన్‌ను ముక్కలు ముక్కలుగా చేయాలని చంద్రబాబు సెటైర్లు గుప్పించారు.
Prudhvi Raj: నేను డ్యాన్స్ చేస్తే ఆ మంత్రి తట్టుకోలేకపోయారు
టీడీపీలోకి రఘురామ
చంద్రబాబును కలిసేందుకు ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు పాలకొల్లు చేరుకున్నారు. పూలపల్లి వద్ద సన్నిహితులతో రఘురామ సమాలోచనలు సాగిస్తున్నారు. మరో రెండు గంటల్లో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని స్పష్టం చేశారు. తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమిలో అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ప్రకటించారు. తాను పోటీ చేసేది ఎమ్మెల్యే, ఎంపీగానో తెలీదని రఘురామ చెప్పారు.
AP Election 2024: ఏపీ ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన
మరిన్ని ఏపీ వార్తల కోసం...
Updated Date - Apr 05 , 2024 | 07:48 PM