ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు లేఖ.. కారణమిదే..?

ABN, Publish Date - Apr 05 , 2024 | 11:01 PM

కేంద్ర ఎన్నికల సంఘా ( Central Election Commission)నికి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) లేఖ రాశారు. ఇంటింటికీ పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా 33 మంది పెన్షన్ దారులు చనిపోయారని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తూ శుక్రవారం లేఖ రాశారు.

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘానికి (Central Election Commission) తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) లేఖ రాశారు. ఇంటింటికీ పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా 33 మంది పెన్షన్ దారులు చనిపోయారని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తూ శుక్రవారం లేఖ రాశారు.

అధికార వైసీపీకి అనకూలంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకోవడం ద్వారా లబ్ధిదారులకు పథకాలు అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సూచనను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు.


AP Elections: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన గుంటూరు, అనంత కీలక నేతలు

కేంద్ర ఎన్నికల సంఘం సూచనలకు విరుద్ధంగా పెన్షన్ల పంపిణీ గ్రామ సచివాలయాల వద్ద చేపట్టాలని సెర్ప్ సీఈవో ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. దీని వల్ల తలెత్తే ఇబ్బందులను తెలుపుతూ ఇంటింటికీ పెన్షన్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరానని చెప్పారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో 1,34,694 మంది ఉద్యోగులు అందుబాటులో ఉన్నారని వారి ద్వారా ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేయొచ్చని తెలిపారు. పింఛన్ల విషయంలో టీడీపీని దోషిగా చేసి రాజకీయంగా లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రభుత్వం పెన్షనర్లను 40 డిగ్రీల ఎండలో వృద్ధులు, వికలాంగులను సచివాలయాలకు పిలిపించారన్నారు. సచివాలయాల వద్ద షామియానాలు, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించలేదన్నారు.


Purandeswari: మే 13న జరిగే ఎన్నికలతో ఆ మార్పు వస్తుంది

సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీకి వచ్చే లబ్ధిదారుల కోసం ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సర్క్యులర్ ఇచ్చినప్పటికీ సచివాలయాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలం అయ్యారని ధ్వజమెత్తారు. అధికారుల నిర్లక్ష్యంతో దాదాపు 60 లక్షల మంది పింఛనుదారులు తీవ్రమైన ఎండలో సచివాలయాలకు వెళ్లి ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

సచివాలయాల వద్ద నగదు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది పింఛను పొందకుండానే ఇంటికి తిరిగి వచ్చారన్నారు. ఈ క్రమంలోనే 33 మంది పింఛనుదారులు వడదెబ్బకు గురై మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటికి వెళ్లి పెన్షన్ అందించి ఉంటే 33 మంది వృద్ధుల ప్రాణాలు పోయేవి కావని చెప్పారు.


YCP: బుగ్గన వర్గానికి మహిళల నుంచి ఊహించని పరిణామం..

అనారోగ్యంతో ఉన్న వారికి ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ ఇవ్వాలని సూచనలు ఉన్నప్పటికీ....ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదన్నారు. ఇదంతా కుట్రపూరితంగానే జరిగిందన్నారు. పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. పింఛనుదారులకు సకాలంలో నిధులు, సరైన సౌకర్యాలు అందించనందుకు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు..


ఇక నుంచి గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛను అందించేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పారు. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించి, 33 మంది మరణానికి కారణమైన అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. పెన్షన్ల పంపిణీ విషయంలో తెలుగుదేశం పార్టీపై వైసీపీ చేసిన విష ప్రచారంపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖలో కోరారు.


ఇవి కూడా చదవండి

Nara Bhuvaneshwari: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబుపై రుద్దుతున్నారు

Kutami: 7 స్థానాల్లో అభ్యర్థులు గెలిచి మోదీ, బాబు, పవన్‌లకు కానుకగా ఇస్తాం: కేశినేని చిన్ని

AP Election 2024: ఏపీ ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 05 , 2024 | 11:06 PM

Advertising
Advertising